చిన్నకోడూరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 1: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాలను కలియ తిరిగి పరిశీలించారు. ప్రతి మంగళవారం నిర్వహించే ఆరోగ్య మహిళ కార్యక్రమ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ మాట్లాడుతూ….. ఆరోగ్య మహిళ పథకాన్ని ప్రతి మహిళ వినియోగించుకోవాలన్నారు. రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వం ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తోందని ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు . మహిళలు రక్త హీనత నుండి బయట పడాలంటే వైద్యులు చెప్పిన సూచనలు పాటించాలన్నారు. తీవ్ర రక్త హీనతతో భాదపడే వారికి సిద్దిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను ప్రభుత్వం అందిస్తుంది అన్నారు. ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలు, ఆకుకూరలు తినాలని సూచించారు. మహిళా ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబము ఆరోగ్యంగా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డా. కాశినాథ్, ప్రోగ్రాం మేనేజర్ డా. రజని , ఎంపిడిఓ శ్రీనివాస్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఉమేష్ చంద్ర, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డా.సరిత , సిహెచ్ఓ సూర్యప్రకాష్,ఆసుపత్రి సిబ్బంది,మహిళలు ఉన్నారు




