మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణలో అగ్రగామిగా తెలంగాణ

  • అంగన్‌ ‌వాడి కేంద్రాల ద్వారా  4.72 లక్షల మంది గర్భిణీలు , బాలింతలకు 17. 63 లక్షల మంది పిల్లలకు కు పోషకాహారం ..
  • మొత్తం 35,700 అంగన్‌ ‌వాడి కేంద్రాలలో 15,169 కేంద్రాలను ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలతో అనుసందానం..
  • అంగన్‌ ‌వాడి  టీచర్లు, సహాయకులకు అత్యధిక వేతనాలు ..
  • కేంద్రాల పని తీరు పై హెల్ప్ ‌లైన్‌ ‌నెంబర్‌:155209 ఏర్పాటు చేసిన ప్రభుత్వం.

సమాజంలో సగభాగమైన మహిళలు కుటుంబ నిర్వహణ తో పాటు  ఆర్దిక వ్యవహార నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కుటుంబం సామాజిక పరిస్థితుల  వలన  నిరుపేద మహిళల్లో ముఖ్యంగా  గర్భిణీ స్త్రీలలో రక్త హీనత ఎక్కువగా వుండి తలి,బిడ్డల ఆరోగ్యం పై ప్రభావం పడుతున్నది.2014  లో  తెలంగాణ ఏర్పడే నాటికి మాతృ మరణాల రేటు 92, శిశు మరణాల రేటు 39 వుండేది.రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమానికి పెద్ద పీట వేసింది. గర్భిణీలు, బాలింతలు , చిన్న పిల్లలకు పౌష్టిక ఆహారం అందించడానికి 35700 అంగన్‌ ‌వాడి కేంద్రాల ద్వారా  జనవరి 01, 2015 నుండి ఆరోగ్యలక్ష్మి క్రింద పోషక  ఆహారాన్ని  ప్రభుత్వం అందిస్తుంది.

అంగన్‌ ‌వాడి కేంద్రాల పనితీరును పర్యవేక్షణ చేసేందుకు 149 וణ• ప్రాజెక్టులను ఏర్పాటుచేసింది. అంగన్‌ ‌వాడి కేంద్రాల ద్వారా 4.72 లక్షలమంది మహిళలు, బాలింతలు లబ్ది పొందుతున్నారు. అలాగే 6 సం.ల లోపు వయసు ఉన్న 17.63 లక్షల మంది చిన్న పిల్లలకు పౌష్టిక ఆహారం అందిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమావళికి అనుగుణంగా గర్భిణీ మహిళలకు బాలింతలకు పోషక విలువలు ఉన్న ఆహారాన్ని అందించుటకు ప్రతి రోజు ప్రతి లబ్ది దారునికి ప్రభుత్వం రూ.24.77 లు ఖర్చు చేస్తున్నది. అంగన్‌ ‌వాడి కేంద్రాల పనితీరుపై లబ్దిదారులు, ప్రజల స్పందనలు తెలుసుకునేందుకు ప్రభుత్వం అంగన్‌ ‌వాడి హెల్ప్ ‌లైన్‌ ‌నెం. 155209 ను నెలకొల్పింది.

అంగన్‌ ‌వాడి కేంద్రాల సహకారంతో గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు ఇమ్యూనిటీ వ్యాక్సినేషన్‌ ‌ప్రక్రియను పటిష్టంగా అమలు చేస్తున్నది. తీవ్రమైన పోషకాహార లోపం తో ఉన్న పిల్లల, ఆరోగ్య సంరక్షణకు బాలామృతం ం కార్యక్రమం ద్వారా ప్రత్యేక పర్యవేక్షణ , అదనపు ఫీడింగ్‌ ‌పథకాన్ని కొన్ని నిర్దేశించిన ప్రాంతాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్నది.. అత్యవసర పరిస్థితులలో చిక్కుకున్న పిల్లలను తరలించి ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టుటకు ప్రతి జిల్లాలో ఒకటి చొప్పున 33 బాల రక్షక్‌ ‌వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  ప్రభుత్వం కృషి ఫలితంగా 2022 నాటికి మాతృ మరణాల రేటు జాతీయ సగటు (103) కంటే తక్కువగా 56 గా నమోదయినది , శిశు మరణాల రేటు దేశ సగటు కంటే (32) తక్కువగా తెలంగాణలో 23 గా వుంది.. ఆసుపత్రులలో ప్రసవాలు 2014 లో 91 % ఉండగా 2022 లో 97%  గా నమోదైంది. దేశ సగటు ( 79 ) కంటే ఎక్కువ శాతం ఆసుపత్రులలో ప్రసవాలు జరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రులలో  2014 సం.లో ప్రసవాల రేటు 30 % కాగా 2022 సం.లో 56 %  కు పెరిగింది.

3 నుండి   6  సంవత్సరాల మధ్య  వయసు గల పిల్లల కు డిజిటల్‌ ‌ప్రీ  స్కూల్‌  ఎడ్యుకేషన్‌ ‌ను అందించుటకు విద్య ఛానల్‌ ‌ద్వారా  ప్రతి రోజు ఒక గంట పాటు ప్రత్యేక  విద్య కార్యక్రమాలను ప్రభుత్వం  ప్రసారం చేయిస్తున్నది, యానిమేషన్‌,  ‌ప్లే వే లెర్నింగ్‌ ‌పద్దతి లో  ప్రసారం చేస్తున్న ఇ – విద్య కార్య క్రమాన్ని  చూస్తున్న  చిన్నారుల సంఖ్య 4 లక్షల వరకు ఉంటుంది .  ప్రీ స్కూల్‌ ‌డిజిటల్‌ ‌విద్యలో  ప్రభుత్వం  చేస్తున్న కృషికి లభిస్తున్న ఆదరణగా  దీనిని పేర్కొనవచ్చు.

అంగన్‌ ‌వాడి కేంద్రాలకు నిత్యావసర సరుకుల సరఫరా ను  మెరుగు పరిచేందుకు ప్రత్యేక  వ్యవస్థను ప్రభుత్వం  నెలకొల్పింది.  ×•• 2000:  2005   సర్టిఫికేట్‌   ‌పొందిన తెలంగాణ ఫుడ్స్ ‌ద్వారా  ఉత్పత్తి చేసిన బాలామృతం తొ పాటు పోషక విలువలున్న  విటమిన్లు, మినరల్స్ ‌కలిగిన ఆహారాన్ని స్నాక్స్ ‌గా  6 సంవతరాల లో పు పిల్లలకు ప్రభుత్వం సప్లై చేస్తున్నది.  ఆధునిక  పద్దతి లో   ప్యాకింగ్‌ ‌చేసిన బాలామృతం ఆహారాన్ని  తెలంగాణలోని అంగన్‌ ‌వాడి  కేంద్రాల తో పాటు ఆంధ్ర ప్రదేశ్‌ ‌రాష్ట్రానికి కూడా తెలంగాణ  ఫుడ్స్ ‌సరఫరా చేస్తున్నది.

గర్భిణీలు, బాలింతలు , చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు కృషి చేస్తున్న అంగన్‌ ‌వాడి ఉద్యోగుల వేతనాలను తెలంగాణ ప్రభుత్వం గణనీయం గా పెంచింది. ప్రధాన అంగన్‌ ‌వాడి టీచర్‌ ‌కు రూ.13,650, మినీ అంగన్‌ ‌వాడి టీచర్‌, ‌హెల్పర్స్ ‌కు రూ. 7800 లను ప్రతినెల గౌరవవేతనంగా చెల్లిస్తున్నది. అంగన్‌ ‌వాడి కేంద్రాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు అత్యధిక వేతనాలు చెల్లిస్తున్న రాష్ట్రాలలో లలో తెలంగాణ ఒకటిగా నిలిచింది. అలాగే అటు చేనేత రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా అంగన్‌ ‌వాడి టీచర్లు, హెల్పర్స్ ‌కు 67411 పోచంపల్లి చేనేత చీరలను ప్రభుత్వం పంపిణీ చేసింది.

కమిషనర్‌, ‌సమాచార పౌర సంబంధాల శాఖ, హైదరాబాద్‌ ‌వారిచే జారీ చేయనైనది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *