పరువు హత్యల ఉన్మాదాలు
నడిరోడ్డుపై రక్తపు మడుగులు
చోద్యం చూస్తున్న సకల జనులు
సాక్షుల్నే దోషులంటున్న అస్రీన్‌లు
మత-కులోన్మాద దారుణ దాష్టికాలు !

కుల-మతాంతర వివాహాల హత్యలు
కులం కత్తి ఝలిపిస్తున్న విపరీతాలు
మతాంతీరకణలు, కులన్యూనతలు
నిమ్నవర్గ యువతకే యమపాశాలు
కులమత నిర్మూలనలే పరిష్కారాలు !

మానవమృగాలు పేట్రేగుతున్న ఘోరాలు
తోబుట్టువులే గొంతు కోస్తున్న అకాలాలు
కులమత కుంపట్లలో బుగ్గిపాలవుతూ..
స్మశానాల పాలవుతున్న నాగరాజులు
మానవీయతనే హత్య చేస్తున్న కత్తులు !
– మధుపాళీ,          కరీంనగర్‌, 9949700037

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page