కేంద్రంలో బిజెపి ప్రభు త్వం డీజిల్, పెట్రోల్ ధరల విషయ ంలోను ఎన్నికల సమ యంలో తగ్గించడం, తర్వాత పెంచడం జరుగుతుంది. మా ఇంటికి వస్తే ఏం తెస్తావ్, మీ ఇంటికి వస్తే ఏమిస్తావ్ అన్న రీతిలో వ్యవహరిస్తుంది. అంతర్జాతీ యంగా ముడి చమురు ధరలు తగ్గుతున్న దశలోనూ ఆ ఉప శమనాన్ని ప్రజలకు కలిగిం చక పోవడం దారుణం. రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో చమురు ధరలు రికార్డు స్థాయిలో పెరిగినందున ఆయిల్ కంపెనీలకు నష్టాలు వచ్చాయని,ఆ నష్టాలను పూడ్చుకోవాల్సి ఉన్నందున ధరలేమి తగ్గవు అని చావు కబురు చల్లగా చెప్పినట్టుగా చెబుతుంది కేంద్ర ప్రభుత్వం. యుద్ధం వేల రష్యా మనకు తక్కువ ధరకె చమురు ఇచ్చినందున ఆయిల్ కంపెనీలు లాభాలు పడ్డాయి. కానీ ఈ విషయాన్ని కావాలనే దాచి పెట్టింది కేంద్రం. అంతర్జాతీయ విపణిలో క్రూడా ఆయిల్ ధరలు ఒకే స్థాయిలో స్థిరంగా ఉన్న పరిస్థితుల్లో ఉత్పత్తికి మరింతగా కోత విధించేందుకు రెడీ అయ్యాయి.
చాలా కాలం వరకు నిలకడగా ఉన్న చెమరు ధరలు రెక్కలు తేవడానికి ఉత్పత్తిలో మరింత కోత విధించడమే ప్రధాన అంశం. చమురు ఉత్పత్తి దేశాలైన సౌదీ అరేబియా, రష్యా, ఓపెక్ ఇతర దేశాలతో సంప్రదింపులు జరిపిన కూడా చమురు ధరలు తగ్గడం లేదు. వీయన్నా కేంద్రంగా పనిచేస్తున్నటువంటి 23 సభ్య దేశాల ఓపెక్ ఈ విషయంలో మిశ్రమ సంకేతాలను ఇస్తుందని, మాంద్యంలో ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎప్ప టికీ పుంజుకొని ఆయా దేశాలకు చెందినటువంటి ట్రావెల్ రంగం, ఇతర పరిశ్రమలు, ఆయిల్ సరఫరా కోసం పరుగులు తీస్తూనే ఉన్నాయి. 20 లక్షల బ్యారెళ్ల ఉత్పత్తి కోత విధించిన తర్వాత కూడా చమరు ధరలు తగ్గుతూనే వస్తున్నాయి. అంతకు ముందు ఏప్రిల్ లో సౌదీ సహా పలు ఓపెక్ దేశాలు రోజుకు 11.6 కోట్ల బ్యారేళ్ల చమరు ఉత్పత్తి కోత అమలు చేశాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 87 డాలర్లకు వెళ్లిన ఆ తర్వాత క్రమంగా దిగివస్తూ, ప్రస్తుతం 75 డాలర్ల వద్ద ఉంది. తాజాగా జూలై లో క్రుడూ ఉత్పత్తిని రోజుకు 10 లక్షల బ్యారేళ్ళ వరకు తగ్గిస్తున్నట్లు సౌదీ అరేబియా తెలిపింది. ఇదిలా ఉంటే మరొకవైపు అమెరికాలో క్రూడాయిల్ ధర 70 డాలర్ల కన్నా దిగువకు రావడం ఆ దేశానికి కలిసి వచ్చింది.
అలాగే యూరోపియన్ యూనియన్‌కు చెందినటువంటి 20 దేశాల్లో కూడా ద్రవ్యోల్బణం కాస్తంత అదుపులో ఉందని,దానికి తోడు అమెరికా అధ్యక్షుడు బైడెన్ గత ఏడాదిగా భారీగా నిల్వలు విడుదల చేసిన అనంతరం ఇటీవల ఆ నిల్వలను తిరిగి భర్తీ చేశారు. దీనివల్ల ఓపెక్ కోతల గురించి అమెరికన్ అధికారులు ఏమి కలత చెందవద్దని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ భిన్న కోణంలో మార్చడానికి తలపెట్టినటువంటి అభివృద్ధి, ప్రాజెక్టులకు నిధులు సమకూరాలంటే ఆయిల్ ధరలు నిలకడగా గరిష్ట స్థాయిలో ఉండాలని సౌదీ భావిస్తుంది.తన వ్యాయా కట్టుబాట్లని తీర్చాలంటే సౌదీకి బ్యారేల్ ఆయిల్ ధర 80 నుంచి 90 డాలర్లు ఉండాలని ఐఎంఎఫ్ అంచనా.ఆయిల్ ధరల క్షీణతకు పై ఎలాంటి ఊహాగానాలు వదిలిన స్పెక్యులేటర్ల భరతం పడతామని అబ్దులజీజ్ బిన్ సల్మాన్ గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఇది ఇలా ఉంటే రష్యా మాత్రం ఇండియా, చైనా, టర్కీ వంటి కొత్త కస్టమర్లకు ఆకర్షించేందుకు క్రూడ్ ఆయిల్ ధర తక్కువగా ఉండాలనే భావిస్తుంది.ఏది ఎలా ఉన్నా ఓపెక్ ప్లస్ దేశాలపై భిన్న రకాల ఉత్తీర్లు వస్తున్నాయి అన్న మాట వాస్తవం. భారత్ కు సరసమైన ధరలకు రష్యా నుంచి క్రూడాయిల్ సరఫరా అవుతుంది.మే నెలలో మరో రికార్డును నమోదు చేసింది.
రష్యన్, క్రుడాయిల్ దిగుమతులు సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఈ అమెరికా దేశాల నుంచి ఉమ్మడిగా కొనుగోలు చేస్తున్న క్రూడాయిల్ పరిమాణాన్ని పెంచాయి. మే నెలలో రష్యా నుంచి భారత్ కు రోజుకు 19.6 కోట్ల బ్యారెళ్ల చమరు సరఫరా అయినట్టు గణాంకాలు తెలుపుతున్నాయి ఏప్రిల్ లో నమోదు చేసిన రికార్డును ఇది దాటిపోయింది.అలాగే మే నెలలో భారత్ దిగుమతి చేసుకున్న మొత్తం క్రూడాయిల్లో రష్యా సరఫరాల వాటా సుమారు 42 శాతం ఉంది. ఇటీవల సంవత్సరంలో ఏదైనా దేశం సరఫరాల్లో సాధించిన అతిపెద్ద వాటా ఇదే అని చెప్పొచ్చు.2021 ఫిబ్రవరి తర్వాత నమోదైన కనిష్ట స్థాయి చూసినట్లయితే సౌదీ అరేబియా నుంచి 5.6 లక్షల టన్నులకు పడిపోయింది. దేశంలో ఒక రాష్ట్రంలో ఒక్కో రేటుతో చమురు ధరలు బగ్గుమంటున్నాయి. దీని ద్వారా సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఉత్పత్తి కోతకు ఓపెక్ దేశాలు అన్నీ కూడా చమురు ధరలు మళ్లీ పెరుగుతాయని అంటున్నారు విశ్లేషకులు.
చమురు ధరలలో భారీ హెచ్చుతగ్గులు స్టాక్ మార్కెట్ స్వింగ్‌లతో కలిసి ఉన్న కొన్ని సందర్భాలు ఉన్నప్పటికీ, కొన్ని ఇటీవలి అధ్యయనాలు చమురు ధరలు మొత్తం స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపవని సూచిస్తున్నాయి.ఈ సందర్భంలో, సహసంబంధం సమాన కారణం కాదు. చమురు ధరలు పెరగడం వల్ల రవాణా సౌకర్యానికి ఇబ్బంది కలుగుతుంది రవాణా ఖర్చులు పెరుగుతాయి.అనేక పరిశ్రమలకు చమురు ప్రధాన ఇన్పుట్. ముడి చమురు ధరలు పెరిగినప్పుడు, సహజంగా, ఇన్పుట్ ఖర్చులు మరియు మొత్తం ఉత్పత్తి ఖర్చులు కూడా పెరుగుతాయి.దీని వలన లాభాల మార్జిన్లు తగ్గుతాయి, ఇది ఆ కంపెనీ స్టాక్ ధరను తగ్గిస్తుంది.దీనికి విరుద్ధంగా, చమురు ధరల తగ్గుదల వ్యతిరేక ప్రభావాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో విమానయాన సంస్థలు, రిఫైనరీలు, లాజిస్టిక్స్, పెయింట్స్ మరియు ఇతర కంపెనీలు ఎక్కువగా ప్రభావితమవుతాయి.
మోటె చిరంజీవి,
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్. 9949194327.





