బీసీలంటే బ్యాక్‌ ‌వర్డ్ ‌క్లాస్‌లు కాదు…బ్యాక్‌ ‌బోన్‌ ‌కాస్ట్

  • సమాజానికి వెన్నెముకలు
  • బిసిలను పదవులతో ఆదుకున్న ఘనత మాది
  • 82 వేల మంది బిసిలు వివిధ పదవుల్లో ఉన్నారు
  • జయహో బిసి సభలో ఎపి సిఎం జగన్‌

విజయవాడ, డిసెంబర్‌ 7 : ‌బీసీలంటే బ్యాక్‌ ‌వర్డ్ ‌క్లాస్‌లు కాదు.. బీసీలంటే బ్యాక్‌ ‌బోన్‌ ‌కాస్ట్.. ‌బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదు.. బీసీలంటే వెన్నెముక అని నిరూపించాని ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ అన్నారు. భారతీయ సమాజానికి వెన్నెముకలు బీసీలని.. గతంలో బీసీలు వెనుకబడిపోయారన్నారు. వాళ్ల పరిస్థితులు మార్చాలని.. తన పాదయాత్రలో 139 బీసీ కులాలను కలిసిన తర్వాత వారి కష్టాలు, నష్టాలు అన్నీ చూశానన్నారు. ఆ తర్వాత వారి ఆశలను, ఆకాంక్షలను తెలుసుకున్న తర్వాత 2019 ఫిబ్రవరిలో ఏలూరులో బీసీ గర్జన నిర్వహించామని గుర్తు చేశారు. రాష్ట్ర నలమూలల నుంచి వచ్చిన బీసీ సోదరులు, అక్కాచెల్లెమ్మలకు పేరుపేరున ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ‌ధన్యవాదాలు తెలిపారు. రాజకీయ సాధికారతతో గ్రామం నుంచి రాజధానుల వరకు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల జనసముద్రం ఈ సభ అన్నారు.

మంత్రివర్గం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నామినేటెడ్‌ ‌పదవుల్లో ఉన్నవారితో పాటూ వార్డు మెంబర్ల వరకు బీసీ కుటుంబం జన సముద్రంలా ఉందన్నారు. 82వేలమంది బీసీలు రాజకీయ సాధికారతతో పదవుల్లో ఉన్నారని.. ’ హృదయంలో జగన్‌.. ‌జగన్‌ ‌హృదయంలో రు’ ఉన్నారన్నారు. ఇది ఎప్పటికీ మన అనుబంధంగా వ్యాఖ్యానించారు. బీసీలంటే ఇస్త్రీ పెట్టలు, కుట్టు మిషన్లు, పనిముట్లు కాదని చంద్రబాబుకు చెప్పాలన్నారు. 2014లో బీసీలకు ఏకంగా చంద్రబాబు 114 వాగ్థానాలు ఇచ్చి అందులో పదిశాతం కూడా అమలు చేయని ఆయనకు చెప్పాలన్నారు. తాము ఇప్పుడు వెన్నెముక కులాలుగా మారామని చెప్పాలన్నారు. రాజ్యాధికారంలో భాగస్వామ్యం.. ఇప్పుడున్న ప్రభుత్వం మాది, మనది అని చెప్పాలన్నారు. డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణమాఫీ దగాను గుర్తు చేయాలన్నారు. గతంలో ఇలా ఇచ్చిన హాలను గుర్తు చేయాలన్నారు. బీసీలను చంద్రబాబు చేసిన మోసాన్ని గుర్తు చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల హాలు అమలు చేయాలని మత్స్యకారులు అడిగితే ఖబడ్దార్‌ అం‌తు చూస్తానని చంద్రబాబు హెచ్చరించిన మాటల్ని.. నాయీ బ్రాహ్మణులు హాలు నెరవేర్చమని అడిగితే తోకలు కత్తిరిస్తానని చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకోవా లన్నారు.

తమకు తోకలు లేవు కానీ  తోకల్ని.. కు మొలిచిన కొమ్ముల్ని..కు కొమ్ము కాసేవారిని కత్తిరించే సామాజిక చైతన్యం ఉందని చెప్పాలన్నారు. ఏలూరు బీసీ డిక్లరేషన్‌లో హాలను ఎలా అమలు చేశామో గమనించాలని కోరారు. బీసీ కులాలకు ప్రభుత్వ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పాం.. చరిత్రలో ఎవరూ చేయని విధంగా 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు. బీసీ కమిషన్‌ను శాశ్వత ప్రాతిపదికన చట్టం చేస్తామని చెప్పాం.. చట్టం చేశాం దేశంలోనే మన రాష్ట్రంలోనే నియమించామన్నారు. నామినేటెడ్‌ ‌పదవుల్లో 50శాతం బీసీలకు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలకు రిజర్వేషన్‌ ‌కల్పిస్తామని చెప్పాం.. చట్టం చేసి నామినేటెడ్‌ ‌పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారన్నారు. నామినేషన్‌ ‌వర్కుల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు హా ఇచ్చామని.. దానిని నిలబెట్టుకున్నామన్నారు. లక్షా 63వేల కోట్లు ఖర్చు చేశామని.. వెన్నెముక కులాలుగా మార్చడం అంటే ఇదిఅని  జగన్‌ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, నిరుపేద వర్గాలు ఒకవైపు ఉంటే.. బీసీల తోకల కత్తిరిస్తాను, ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని చంద్రబాబుతో యుద్ధం చేయాలని చెప్పాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *