బీజేపీ వాళ్లకు సిగ్గు లేదు..బాధ్యత లేదు..!

విరుచుకుపడ్డ మంత్రి హరీష్‌ ‌రావు

భువనగిరి, మే 20 : ‘‘కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డికి ఏ మాత్రం బాధ్యత లేదు…బీజేపీ వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు… మాటలకే  పనికి వొస్తారు బీజేపీ వాళ్ళు…ఎయిమ్స్‌ను చుస్తే తెలుస్తుంది బీజేపీ వాళ్ల సక్కదనం…’’ అని రాష్ట్ర ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తీవ్ర విమర్శలు చేసారు. భువనగిరి జిల్లా కేంద్ర హాస్పిటల్‌లో ఎస్‌ఎన్‌సీయు వార్డ్, ‌పిడియాట్రిక్‌ ‌వార్డ్‌లను శుక్రవారం ప్రారంభించి, టి.డయాగ్నో స్టిక్‌ ‌సెంటర్‌ ‌నిర్మాణానికి మంత్రి హరీష్‌ ‌రావు శంకుస్థాపన చేసారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..’’ఎయిమ్స్‌లో ఇప్పటి వరకు ఒక్క ఆపరేషన్‌ ‌జరగలేదు..బీజేపీ వాళ్లకు సిగ్గు లేదు..బాధ్యత లేదు… ఇప్పటి వరకు ఎయిమ్స్‌లో అభివృద్ధి ఏమీ జరగలేదు… కేంద్ర ప్రభుత్వం  ఇచ్చింది ఒక్క ఎయిమ్స్ ..ఆ ఎయిమ్స్‌ను కూడా గాలికి వదిలేసింది…ఎయిమ్స్‌లో చదువుతున్న 212 మంది వైద్య విద్యార్థులు ఎక్కడికి పోవాలి…వాళ్ళు నానా అవస్థలు పడుతున్నారు….ఎందుకు ఇంత అలసత్వం…ఎందుకు ఇంత  నిర్లక్ష్యం.. బీజేపీ వాళ్ళు సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నిర్మించిన సూర్యాపేట, నల్గొండ మెడికల్‌ ‌కాలేజీలు ఎలా ఉన్నాయో వెళ్లి చూడండి…’’ అని హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *