ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 27: గౌడ కులస్తుల సంక్షేమానికి కృషి చేస్తానని ఉప్పల్ బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం పెద్ద ఉప్పల్ గౌడ సంక్షేమ సంఘంతో బండారి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నాయకులతో కలిసి సమావేశమయ్యారు. బండారి లక్ష్మారెడ్డి కి గౌడ సంఘం మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడ్డాక గౌడ కులస్తుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేశారన్నారు. ఈత, తాటి చెట్ల పెంపకంతోపాటు పింఛన్, బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఒక అవకాశం ఇవ్వండి ఉప్పల్ ప్రజలకు సేవ చేస్తా అని ఈనెల 30వ తారీకు జరిగే ఎన్నికలలో ఈవీఎం మిషన్లో మూడో నెంబర్ లో ఉన్న కారు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరారు. పిలుపు మేర దూరంలో ఉంటూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తూ ఉప్పల్ ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉంటానని అన్నారు. నా దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. లక్ష్మారెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని గౌడ కులస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అరటికాయల భాస్కర్, గౌడ సంఘం అధ్యక్షులు బజారు హరినాథ్ గౌడ్, బూత్కుల పెంటయ్య గౌడ్, మీనంపల్లి అశోక్ గౌడ్, పండ్ల శ్రీనివాస్ గౌడ్, మీనంపల్లి నరసింహ గౌడ్, కందికట్ల అశోక్ గౌడ్, పంజాల జైహింద్ గౌడ్, ఈశ్వర్ గౌడ్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
బండారి లక్ష్మారెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపిస్తాం ఉప్పల్ గౌడ కులస్తులు ఏకగ్రీవ తీర్మానం
