ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 2 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తుందని ఆమనగల్లు మండల వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి అన్నారు. బుధవారం మంగళపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలకు రూ. 12,50,000 ( పన్నెండు లక్షల యాభై వేలు ) కేటాహించటం జరిగిందనీ అన్నారు. పాఠశాలలో పనులన్నీ పూర్తి చేయడం జరిగిందన్నారు. విద్యార్తులు, ఉపాధ్యాయు లతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసు కున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.



