పోలీస్‌ ఉద్యోగ నోటిఫికేషన్‌ ‌సరే… మిగతా ఉద్యోగాల సంగతేంటి

వాటికి కూడా నోటిఫికేషన్‌ ఇవ్వాలి
సిఎం కెసిఆర్‌కు బండి సంజయ్‌ ‌లేఖ

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 26 : ‌పోలీసు శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ నేపథ్యంలో..మిగతా శాఖల్లో పోస్టుల భర్తీ ఎప్పుడంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ప్రశ్నించారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌ప్రకటించాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. కాలయాపన లేకుండా అన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలన్నారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌బహిరంగ లేఖ రాశారు. పోలీసు శాఖ నోటిఫికేషన్‌ ‌జారీ నేపథ్యంలో.. మిగతా 63,425 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఎప్పుడిస్తారని లేఖలో సంజయ్‌ ‌ప్రశ్నించారు. 8 ఏళ్ల తెరాస పాలనలో కేవలం పోలీసుల పోస్టులే భర్తీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఇతర శాఖల్లోని ఖాళీల భర్తీని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. నియంత పాలనకు అడ్డురాకూడదనే పోలీసుల పోలీస్టుల భర్తీ అని సంజయ్‌ ‌పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాలని బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. మూడున్నరేళ్లలో ఒక్కో నిరుద్యోగికి రూ.1.20 లక్షల భృతి చెల్లించాలని అన్నారు. ఒప్పంద, పొరుగు సేవల సిబ్బందిని క్రమబద్ధీకరించాలని కోరారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ కేంద్రాల్లో ప్రభుత్వం శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న బండి సంజయ్‌.. ‌కాలయాపన లేకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలని విన్నవించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *