విభజన హాల అమలు బాధ్యత కేంద్రానిదే: మధు
విజయవాడ,డిసెంబర్2 : పోలవరం అసలేం జరగుతుందో ప్రజలకు తెలియచేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై ఇంతకాలం అధికార వైసిపి ఎందుకు మౌనంగా ఉంటుందని సీపీఎం సీనియర్ నేత పి.మధు అన్నారు. పోలవరం నిర్మాణాం కేంద్రం బాధ్యతని, దానిని పూర్తిచేసేలా ఒత్తిడి తేవాలని అన్నారు. కేంద్రం ఇచ్చిన హాల అమలుకు ప్రజల మద్దతుతో కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని, అందుకు సీపీఎం కూడా మద్దతు ఇస్తుందని అన్నారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకుంటే బహిరంగ ధర్నాలు, ఆందోళనబాట చేపడతామని హెచ్చరించారు.
పోవలరం నిర్మాణంతోపాటు రాష్టాభ్రివృద్ధికి చేయూత ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్న విషయాన్ని ఈ సందర్బంగా మధు గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఒక మాట, అధికారం చేజిక్కించుకున్న తర్వాత హాల విస్మరణ, అమలుకు నోచుకోని పథకాలతో ప్రజలను మభ్యపెట్టే రీతిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి, విభజన చట్టంలోని హాలను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. నిధుల మంజూరులో తాత్సారం చేస్తోందని, కడపలో ఉక్కు పరిశ్రమ వంటి హాలన్నీ విస్మరించిందని ఆరోపించారు.