ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 19 : తలకొండపల్లి మండలం చీపునుంతల గ్రామానికి చెందిన బీ.ఆర్.ఎస్ నాయకుడు ఉదరి పర్వతాలు యాదవ్ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతు హైదరాబాద్ లోని ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న కల్వకుర్తి నియోజకవర్గ బీ.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీపీ సి ఎల్. శ్రీనివాస్ యాదవ్ పర్వతాలు యాదవ్ ని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రూ. 5, వేల ఆర్థిక సహాయం అందజేశారు. డాక్టర్ లను మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ఆయన వెంట బత్తుల శేఖర్ గౌడ్, శివరాజ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.