నిండు చంద మామలో
మచ్చను చూడగలం
అబేధ్యమైన లక్ష్యాలను
సునాయాసంగా సాధించగలం
కొత్త ఆవిష్కరణలు
చవి చూడగలం
ఒకప్పుడు వంట్టింటికే పరిమితమైన
మగువలు మగవారితో పోటీ పడగలరు
అభివృద్ధిలో ఇతర దేశాలు తో
పోటీ పడుతూ ముందంజ వేయగలం
భాషలలో రారాజు తెలుగు భాష అని
ఎందరో ఇతర భాషాభిమానులు గుర్తించ గలరు
అంటు మొక్కలను
అమితంగా ప్రేమించ గలం
కులాంతరం ప్రేమ పెళ్లి వృక్షాలను
పరువు గొడ్డలు తో నరికేయడం ఏమిటో
ఆడపిల్ల దొరకని కొన్ని కులాలు
కులం కంచే పక్కన పెట్టేస్తున్నారు
అభిమానం దురభిమానం కాకూడదు
పెంచిన ప్రేమ గొప్పదే కానీ…
మితిమీరితే అమృతం కూడ
విషం అవుతుంది
కులం విష కత్తి దూసి ఇతర కులం వాళ్లను
చంపేసి నీవాళ్ళును అనాదులను చేసే హక్కు
నీకెక్కడిది
కులం కంచే దాటారంటే నీ పెంపకంలోనే
లోపం ఎక్కడో ఉందని గుర్తించు
వీలైతే వాళ్ళ తప్పులను క్షమించి పెద్ద మనసు చాటు
లేదంటే వాళ్ళను వాళ్ళమానాన్ని బ్రతకనీ
అదే నీవు వాళ్ళకు చేసే మహోపకారం
కాలం మారటం కాదు కానీ
మనసతత్వాలు కూడ మారుతున్నాయి
– గాదిరాజు రంగరాజు
చెరుకువాడ
(మరో పరువు హత్యను నిరసిస్తూ ఈ కవిత )