మౌనంలో
మాటది ఒంటరితనం
గొంతుది ఏకాంతం…
కనిపించని మనసు
కలలో ఎదురుపడినా
చూడలేని చిన్నతనమేదో
ఊహించని ఊహకు చిక్కి
ఊపిరాడక నిజమై
ఉవ్వెత్తున కెరటమై
భాష లేని భావంగా
ఎద తీరానికి కొట్టుకొస్తుంటే
కోతకు గురైయ్యే కోరికలు
నిద్ర ముసురులో
మగత ముడతల్లో
ఒళ్ళు విరుచుకుని
కలవరింత
గొంతు సవరించుకున్న
కల నీవేగా మనసా!
-సుభాషిణి వడ్డెబోయిన