Take a fresh look at your lifestyle.

దగాపడిన వారిదే…

ఓ మహాకవీ శ్రీ శ్రీ…
శ్రామికుడే దేవుడన్నది వాదంగా
స్వేదమే నీ వేదంగా చేసుకొని,
కర్షక స్వేదాన్ని సిరాచుక్కలతో
కలిపి అగ్గి రాజేసి,
సామాన్యులకు  కలంతో
అండగా నిలిచి,
అణ్వాస్త్రాలు కాదు,అన్నవస్త్రాలు
ముఖ్యమని చాటి చెప్పిన
నీలో కదిలే నవ్య కవిత్వం
శ్రామిక లోకానికి అంకితమన్నావు.
స్టెతస్కోపు కన్నా మిన్నగా
జనం వేదనని వినే కలంపట్టి,
కన్నీటికి ఉప్పెన రూపాన్నిచ్చిన
నీ అక్షరాలు ఆశావాదానికి కళ్ళు,
పురోగామి భావాలకు కాళ్ళు.
నీ కవితలు సామాజిక స్పృహకు బలం,
సాహితీ ప్రియంభావుకులకు ఆలవాలం.
ప్రతీ కవితను విప్లవ కేతనంగా మార్చిన
రెండక్షరాల నీవంటే
లోతు, ఎత్తు,అగ్ని,ఓదార్పు,ఓ నేత.
కాలం నాడి తెలిసిన మహాకవివి నీవు.
దగాపడిన వారందరిదీ నీ కవిత్వం.

– వేమూరి శ్రీనివాస్‌,9912128967, ‌తాడేపల్లిగూడెం

Leave a Reply