Take a fresh look at your lifestyle.

గమ్యం ముద్దాడనున్న ప్రేమ సిపాయి …

  • రేపు శ్రీనగర్‌లో ముగియనున్న యాత్ర
  • కాశ్మీర్‌లో కొనసాగుతున్న రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో
  • లెత్‌పోరాలో పుల్వామా అమర జవాన్లకు రాహుల్‌ ‌నివాళి
  • పాదయాత్రలో పాల్గొన్న మెహబూబా ముఫ్తీ, ప్రియాంకా గాంధీ

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జనవరి 28 : కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి దేశ సమైక్యత కోసం చేపట్టిన హారత్‌ ‌జోడో అంతిమ చరణంలో కాశ్మీర్‌లో కొనసాగుతున్నది. శుక్రవారం భద్రతా కారణాల వల్ల అర్ధాంతరంగా ఆగిపోయిన యాత్ర శనివారం అవంతిపోరా నుండి ప్రారంభించారు. జాతీయ రహదారిపై యాత్రకు స్వాగతం పలికేందుకు పలు చోట్ల భారీ సంఖ్యలో కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు, స్థానికులు గుమిగూడారు. కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు పార్టీ జెండాలు చేతపట్టుకుని రాహుల్‌ ‌గాంధీ, భారత్‌ ‌జోడో యాత్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. కాగా పిడిపి చీఫ్‌ ‌మెహబూబా ముఫ్తీ, కాంగ్రెస్‌ ‌ప్రధాన కార్యదర్శి•, రాహుల్‌ ‌సోదరి ప్రియాంకా గాంధీ రాహుల్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. యాత్ర శ్రీనగర్‌లోని పాంథా చౌక్‌ ‌వైపు కొనసాగే క్రమంలో పాంపోర్‌లోని బిర్లా ఓపెన్‌ ‌మైండ్స్ ఇం‌టర్నేషనల్‌ ‌స్కూల్‌ ‌దగ్గర ఆగింది.

పాదయాత్ర మార్గ మధ్యంలో రాహుల్‌ ‌గాంధీ ఫిబ్రవరి 14, 2019న పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన 40 మంది సిఆర్‌పిఎఫ్‌ ‌జవాన్లకు సంఘటనా స్థలం లెత్‌పోరా వద్ద నివాళులర్పించారు. అక్కడే ప్రియాంకా రాహుల్‌ ‌పాదయాత్రలో కలిశారు. కాగా శుక్రవారం భద్రతా కారణాలలో ఆగిపోయిన సంఘటన చేటుచేసుకోడంతో శనివారం రాహుల్‌ ‌గాంధీకి భారీగా మూడంచెల భద్రత కల్పించారు. దాంతోపాటు స్థానిక పోలీసులు, సిఆర్‌పిఎఫ్‌, ఆర్మీ రాష్ట్రీయ రైఫిల్స్ ‌జాతీయ రహదారినానుకుని గ్రామాల ద్వారా కొనసాగిన సందర్భంలో ఎక్కడికక్కడ యాత్రకు భద్రతను కల్పించారు. కన్యాకుమారిలో సెప్టెంబర్‌ 7, 2022‌న ప్రారంభమైన భారత్‌ ‌జోడో యాత్ర రేపు జనవరి 30న శ్రీనగర్‌లో పార్టీ కార్యాలయంలో పతాకావిష్కరణతో ముగియనుంది. అదే రోజు సోన్‌వార్‌ ఎస్‌కె స్టేడియంలో భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే విధంగా బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. బహిరంగ సభలో పలువురు కాంగ్రెస్‌ అ‌గ్రనేతలు పాల్గొననున్నారు.

Leave a Reply