రాష్ట్రంలో అధికారం లో ఉన్న భారత్ రాష్ట్ర సమితి క్రూరమయిన అవినీతి ఆర్ధిక దలారులు ,అదానీ అంబానీలకు సాగిలా పడుతున్న కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నియంతృత్వ విధానాలే తెలంగాణా వరదలకు కారణమని పేర్కొంటూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ( మావోయిస్టు ) తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ మంగళ వారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో ప్రభుత్వం నిర్మించిన భారీ ప్రాజెక్టులు సామాన్యులకు ఏ మాత్రం ఉపయోగకరంగా లేక పోగా వారిని కష్టాల పాలు చేసిందని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రజావ్యతిరేక ఆర్ధిక విధానాలను వ్యతిరేకిస్తూ ..బాధితులకు అండగా మావోయిస్టు నిలబడుతుందని ప్రకటనలో పేర్కొన్నారు. వరదల్లో సర్వం కోల్పోయిన వారికి ప్రభుత్వం రు.10 లక్షల తక్షణ ఆర్ధిక సహాయం ,పునరావాసం ,రోడ్ల మరమ్మత్తు చేపట్టాలని ..భూకబ్జా దారులపై కఠినమయిన చర్యలు తీసుకోవాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది.




