- ఆ పార్టీ వల్లనే గతంలో తెలంగాణకు అన్యాయం
- ప్రలోభాలకు లోను కాకుండా ప్రజలు ఆలోచించి వోటేయాలి
- పరకాలలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వొస్తుంది
- పరకాల ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్…చల్లా ధర్మారెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి
ప్రజాతంత్ర, పరకాల, నవంబర్ 17 : కాంగ్రెస్సోల్లు. బీజేపోళ్ల మాటలను నమ్మితే ఆగమయ్యేది మన బతుకులేనని, అసలు ఉన్న తెలంగాణను ఊడకొట్టింది కాంగ్రెస్ పార్టీ కదా అంటూ సిఎం కెసిఆర్ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శుక్రవారం పరకాల అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కెసీఆర్ మాట్లాడుతూ… ఎన్నికలు రాగానే ఆగమాగం కావోద్దు..మాయ మాటలను నమ్మి మోసపోవద్దు. నవంబర్ ముప్పై తారీఖున ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ మూడో తారీఖున ఎవరు గెలుస్తారు అనేది తేలిపోతుంది..ఆ తర్వాత అసలు ముచ్చట మొదలవుతుంది. పరకాలలో ఎవరు గెలిస్తే అక్కడ అధికారంలోకి వాళ్ళు వొస్తారు. చల్లా ధర్మారెడ్డి పరకాలలో కోర్టు కావాలని అడిగారు.
హైకోర్టు జడ్జిని అడిగి ఆ కోర్టును ఇక్కడ ఏర్పాటు చేస్తాను. చల్లా ధర్మారెడ్డిని గెలిపిస్తే పరకాలలో రైతుబంధు పదహారు వేలు వొస్తాయి. పించన్ ఐదు వేలు వస్తాయి….అని ప్రజలకు సూచించారు. ఇంకా కెసిఆర్ మాట్లాడుతూ…కాంగ్రెస్ పాలనలో రైతన్నల ఆత్మహత్యలు. కరెంటు కష్టాలు..నేతన్న, గీతన్నల ఆత్మహత్యలు. ఇదే పరకాలో ఆడబిడ్డలు తాగునీళ్ళ కోసం బిందెలతో ధర్నాలు చేసేది కదా.. తెలంగాణ రాగానే రైతుబాగుంటే దేశం బాగుంటుందని రైతు సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాము.. సంపదను పెంచుతున్నాము.. పంచుతున్నాము.. రైతుబంధు వేస్ట్ అని పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు. రైతుబంధు వేస్టా.. ? మూడు కరెంటు చాలు అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంటుండు. ధరణిని ఎత్తేస్తామని కాంగ్రెస్సోళ్ళు అంటున్నారు.
ధరణిని ఎత్తేస్తామనేవాళ్లను బంగళాఖాతంలో కలిపేద్దామా..?, మూడు గంటల కరెంటు కావాల్నా..? ఇరవై నాలుగంటల కరెంటు కావాల్నా ఆలోచించుకోవాలి..?. పరకాలలో చల్లా ధర్మారెడ్డిని గెలిపించండి..ఆయన అడిగిన పనులన్నీ చేసి పెడ్తా అని అన్నారు. అంతకుముందు చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ…గత పదేండ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పరకాల నియోజకవర్గంలో వెయ్యి నుండి రెండు వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేసుకున్నాము. దేశంలో తెలంగాణలో ఎక్కడ లేని విధంగా మెగా కాకతీయ టెక్సట్ టైల్ పార్కు ఏర్పాటుతో లక్షమంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాము. ఒక్క సంగెం పరకాల మండలంలోని పదకొండు వేల మంది యువతకు ఉపాధి కల్పించబోతున్నాము. పరకాలలో ఆర్డీఓ ఆపీసును ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చొరవతో ఏర్పాటు చేసుకున్నాము.. నేను చేసిన అభివృద్ధి మీ కండ్ల ముందు కన్పిస్తుంది. అభివృద్ధి చేసిన నేను మీ ముందు ఉన్నాను.. కారు గుర్తుకు ఓటెసి గెలిపించి ఆశీర్వదించండి. మీకు సేవ చేసుకుంటాను…అని అన్నారు.





