హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 23 : ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థుల ఫోరమ్ అభ్యర్థి మంచాల శ్రీకాంత్ ను గెలిపించాలని ఫోరమ్ అధ్యక్షులు అయ్యల సోమయాజులు నాగ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు రంగు షణ్ముఖ చారి, ప్రధాన కార్యదర్శి కె.రవి, కార్యదర్శులు కీర్తి రాణి, ప్రసన్న కుమార్, మహిళా విభాగం అధ్యక్షురాలు జోత్స్నా రాణి విజ్ఞప్తి చేసారు. గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్యెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజాసమస్యలను ఫుర్తిగా విస్మరించి, కనీస సౌకర్యాలు లేక ప్రజలు అనేక సమస్యలను ఏరుదుర్కుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో 28 మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నామని, ఎల్బీ నగర్ నియోజకవర్గం అభివృద్ధిని ఆకాంక్షిస్తూ తామందరం కలసి ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థుల ఫోరమ్ గా ఏర్పడి, తమ ఉమ్మడి అభ్యర్థిగా సహచర అభ్యర్థి మంచాల శ్రీకాంత్ కు ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని, మంచాల శ్రీకాంత్ కు ఫూర్తి మద్దతు ఇచ్చి, ప్రచారాలు నిర్వహించి ఎమ్యెల్యే గా గెలిపించుకుంటామని వారు అన్నారు. అభ్యర్థి మంచాల శ్రీకాంత్ మాట్లాడుతూ లోకల్ వ్యక్తిని గెలిపించుకుంటే లోకల్లో ఉండే అన్ని సమస్యలు తీర్చగలనని కాబట్టి తనను గెలిపించగలరని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేసారు. తనను ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఎల్బీ నగర్ లో మంచాల శ్రీకాంత్ గెలిపించండి
