ఎపి సిఎస్‌గా జవహర్‌ ‌రెడ్డి బాధ్యతలు

సచివాలయంలో పలువురు అధికారుల అభినందనలు
అమరావతి,నవంబర్‌30 : ఆం‌ధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్‌. ‌జవహర్‌రెడ్డి బుధవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు వివిధ శాఖల ఉన్నతాధికారులు అభినందనలు తెలియజేశారు.  డిసెంబర్‌ 1‌న బాధ్యతలు చేపట్టాల్సింది ఉండగా నేడు ముహూర్తం బాగుండటంతో వెంటనే స్వీకరించారు. సచివాలయం మొదటి బ్లాక్‌లో ఆయన బాధ్యతలు చేపట్టారు.

ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సర్‌ ‌శర్మ ఈనెల 30న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆయన స్థానంలో సీఎస్‌గా కె.ఎస్‌ ‌జవహర్‌ ‌రెడ్డిని ఎంపిక చేసింది ప్రభుత్వం. ముందుగా సీఎస్‌ ‌రేసులో పలువురి పేర్లు తెరపైకి వచ్చినా.. జవహర్‌రెడ్డివైపే మొగ్గు చూపింది. 1990 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్‌ ‌జవహర్‌రెడ్డి.. ప్రస్తుతం సీఎంకు ప్రత్యేక కార్యదర్శిగా కొనసాగుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *