– డిప్యూటీ సీఎం చేతులమీదుగా సీఎండీకి అందజేత
విద్యుత్ పంపిణీ కార్యకలాపాలు, సబ్స్టేషన్ల నిర్వహణ, సబ్‌స్టేషన్ నిర్మాణాల్లో అత్యుత్తమ నాణ్యతను గుర్తిస్తూ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(ఎన్పీడీసీఎల్)కు ఐఎస్వో 9001:2015 క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికెట్ లభించడం ఎంతో గర్వ కారణమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అదేవిధంగా ఉద్యోగుల భద్రతపై అనునిత్యం తీసుకుంటున్న చర్యలకు, అలాగే విద్యుత్ అధికారుల పల్లె బాట, పట్టణ బాట వంటి కార్యక్రమాలు, భద్రతా నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ సంస్థ అనుసరిస్తున్న సురక్షా ప్రమాణాలను గుర్తిస్తూ ఐఎస్వో 45001:2018 ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సర్టిఫికెట్ కూడా వ్రచ్చిందనీ పేర్కొన్నారు. ఈరెండు సర్టిఫికెట్లు హెచ్‌వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ జారీ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో మొదటిసారిగా ఎన్పీడీసీఎల్ సంస్థ రెండు ఐఎస్వో (9001, 45001) సర్టిఫికెట్లను పొందడం కార్యనిర్వహణలో అత్యుత్తమ పని పదేశాలలో, భద్రతాపరంగా ఒక మైలురాయిగా నిలుస్తుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ రెండు సర్టిఫికెట్లను ఉప ముఖ్య మంత్రి చేతుల మీదుగా మధిరలో జరిగిన కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ సీఎండీకి అందజేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





