Take a fresh look at your lifestyle.

ఇం‌డోనేషియాలో కొనసాగుతున్న సహాయక చర్యలు

భూకంపంలో 162 మంది మృత్యువాత పడ్డట్లు గుర్తింపు
ముమ్మరంగా శిథిలాల తొలగింపు చర్యలు

జకర్తా: ఇం‌డోనేషియాపై భూకంపంలో ఇప్పటి వరకు 162మంది మృత్యువాత పడ్డారని సమాచారం. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. భూకంపంలో ఆస్పత్రి భవనాలూ దెబ్బతినడంతో ఎమర్జెన్సీ బృందాలు క్షతగాత్రులకు రోడ్లపైనే చికిత్సలు నిర్వహించాయి. బాధితులు హాహాకారాలు చేస్తుండగా, వైద్యులు ఫ్రాక్చర్‌ అయిన వారి కాళ్లు, చేతులకు కట్లు వేయడం.. అటెండెంట్లు, వలంటీర్లు సెలైన్‌ ‌బాటిళ్లను చేతులో పట్టుకుని, క్షతగాత్రులకు గ్లూకోజ్‌ ఎక్కించడం వంటి దృశ్యాలు కనిపించాయి. రీజినల్‌ ఆస్పత్రిలో నవజాత శిశువులను కూడా రోడ్డు పక్కనే ఓ టార్బాలిన్‌పై సపర్యలు చేయడం వంటి వీడియోలు సోషల్‌ ‌డియాలో వైరల్‌ అయ్యాయి. అంబులెన్స్‌లు అందుబాటులో లేకపోవడంతో.. ఆటో ట్రాలీలు, ఇతర వాహనాల్లో క్షతగాత్రులను తరలించారు. 10 గంటల వ్యవధిలో 62 సార్లు భూమి కంపించింది. సోమవారం మధ్యాహ్నం 10-15 సెకన్లపాటు ప్రధాన భూభాగమైన జావాలో 5.6 తీవ్రతతో బీభత్సం సృష్టించిన భూప్రకోపం 162 నిండు ప్రాణాలను బలిగొంది. సాయంత్రం 7 గంటల వరకు ఇదే ప్రాంతంలో 1.5 నుంచి 4.8 తీవ్రతతో మొత్తం 62 సార్లు భూమి కంపించింది. రాత్రి 9.16కు జకర్తా వాయవ్య ప్రాంతంలో పాపువా దీవుల్లో 5.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. అక్కడ కూడా జనావాసాలు పెద్దసంఖ్యలో నేలమట్టమైనట్లు తెలుస్తోంది. అక్కడ మరణాల సంఖ్య తెలియాల్సి ఉంది. మధ్యాహ్నం 12.30 సమయంలో తొలుత జావాలోని సియాంజుర్‌ ‌నగరం కేంద్రంగా భూగర్భంలో 10 కిలోటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. 10-15 సెకన్లపాటు భూమి కంపించడంతో జావా ద్వీపం వణికిపోయింది. 162 మంది మృతిచెందినట్లు ఇండోనేషియా జాతీయ విపత్తుల సంస్థ చీఫ్‌ ‌సుహర్యంటో వెల్లడించారు.

సియాంజుర్‌లో ఓ ఇస్లామిక్‌ ‌బోర్డింగ్‌ ‌స్కూల్‌, ‌రీజినల్‌ ఆస్పత్రితోపాటు.. పలు ఆవాస ప్రాంతాలు, నాలుగు ప్రభుత్వ కార్యాలయాలు, ఒక ప్రార్థన మందిరం, మూడు స్కూళ్ల గోడలు కుప్పకూలాయి. ఇక్కడే మృతుల సంఖ్య అధికంగా ఉందని, మరణించిన వారిలో చిన్నారులే ఎక్కువగా ఉన్నారని వెల్లడించారు. 700 మందికి పైగా గాయపడినట్లు తెలిపారు. వందల ఇళ్లు, అపార్ట్‌మెంట్లు ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని, మరణాల సంఖ్య పెరిగే ప్రమాదముందని సియాంజుర్‌ ‌నగర పరిపాలన అధికారి సుహెర్మాన్‌ ఆం‌దోళన వ్యక్తం చేశారు. వరుస ప్రకపంనల కారణంగా మరణాల సంఖ్య పెరిగిందని పశ్చిమ జావా గవర్నర్‌ ‌పేర్కొన్నట్లు కథనాలను ప్రసారం చేశాయి. మృతుల్లో చిన్నారులే అధికంగా ఉన్నట్లు గవర్నర్‌ ‌చెప్పినట్లు పేర్కొన్నాయి. విపత్తు నిర్వహణ సంస్థ చేపట్టిన సహాయక చర్యలకు ప్రతికూల వాతావరణంతో ఆటంకాలేర్పడినట్లు బీఎన్‌పీబీ అధికారులు తెలిపారు.

భూకంపం కారణంగా బోగోర్‌-‌సియాంజుర్‌ ‌రహదారిపై కొండ చరియలు విరిగిపడ్డాయని వివరించారు. వర్షం పడే సూచనలున్నట్లు వాతావరణ శాఖ పేర్కొందని, అదే జరిగితే వరదలతో మరింత ముప్పు పొంచి ఉంటుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ గుడారాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, ప్రజలను తరలిస్తున్నట్లు జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు పేర్కొన్నారు. మొత్తం 13 వేల మంది పౌరులు నిరాశ్రయులైనట్లు తెలిపారు. 2,272 ఇళ్లు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. మధ్యాహ్నం భూకంపం ధాటికి వణికిపోయామని సియాంజుర్‌లో ఓ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి అంతర్జాతీయ వార్తాసంస్థలతో చెప్పారు. జనావాసాల్లో ప్రజలు ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. ఇరుకు వీధులు ఉన్న పశ్చిమ సియాంజుర్‌లో సహాయక చర్యలకు ఆటంకాలేర్పడ్డాయి. వరుస ప్రకంపనల నేపథ్యంలో ప్రజలు ఆరుబయటే ఉండాలని అధికారులు సూచించారు. ఇళ్లు, ఇతర మౌలిక వసతులు దెబ్బతిన్నాయని, నష్టాన్ని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. మొదటి భూకంపం వచ్చిన కొద్దిసేపటికి ఇళ్లలో వస్తువులను తెచ్చుకునేందుకు పౌరులు వెళ్లారని, ఆ సమయంలో భూమి మళ్లీ ప్రకంపించడంతో శిథిలాల కింద చిక్కుకుపోయారని స్థానిక వార్తా సంస్థలు వెల్లడించాయి.

Leave a Reply