– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 24: ఆరోగ్యంగా, నాజూగ్గా ఉండాలంటే చక్కటి ఆహారపు అలవాట్లను పాటించడంతోపాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం ముఖ్యమని సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. గోల్నాకలోని జిందా తిలిస్మాత్ రోడ్డులో ఫ్రెండ్స్ ఫిట్నెస్ వరల్డ్ జిమ్‌ను ఆయన అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌తో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజూ జిమ్‌లో వ్యాయామం చేయడం ద్వారా శారీరక దృఢత్వంతోపాటు, మానసికంగా ఒత్తిడి తగ్గడం, బరువు తగ్గడంతోపాటు ఆరోగ్యపరంగా మరెన్నో ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. జిమ్ నిర్వహకులు ఎ. సందీప్, పి.రమేష్, మహమ్మద్ అలీ, ఇ.రాజు, మహమ్మద్ రహీముద్దీన్లను వారు అభినందించారు. యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకోవడం అభినందనీయమన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండిరగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.




