Take a fresh look at your lifestyle.

ఆధ్యాత్మికత – ప్రేమానంద

అందువల్ల ఇటువంటి ప్రజల కోసం తక్షణ ఉపశమనాలు ఇచ్చే, ఆరోగ్యాలు బాగు చేసే, ఆర్థిక వృద్ధికి దారి తీసే ఉపదేశాలు కావాలి. ఆ తక్షణ మత అవసరం నుంచే దొంగస్వాము­లు, అమ్మలు, బాబాలు పుట్టుకొస్తున్నారు. ఆ విధంగానే ఎన్నో ఆధ్యాత్మిక కేంద్రాలు పుట్టుకొస్తున్నాయి. ఆ కేంద్రాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి . ఆ కేంద్రాలకు పరుగులుపెట్టే భక్తులు ఆ కేంద్రాల సంపదను కూడా పెంచుతున్నారు. అందువల్ల ఆ కేంద్రాలలో భక్తులకు సహకరించడానికి అత్యాధునిక సౌకర్యాలు కూడా తయారవుతున్నాయి­.

ఆ ప్రేమానంద 1989లో తమిళనాడులోని పుదుక్కొట్టై జిల్లాలో ప్రేమానంద ఆశ్రమం స్థాపించాడు. నిజానికి ఆయన ఇటువంటి ఆశ్రమాన్ని శ్రీలంకలో నిర్వహిస్తుండేవాడు. శ్రీలంకలో ప్రారంభమైన జాతి కలహాలవల్ల 1984లో అక్కడ దుకాణం మూసేసి తమిళనాడు వచ్చాడు. త్వరలోనే ఇక్కడ కూడా ఆయనకు శిష్యులు పెరిగారు. ప్రభుత్వం నుంచో, ప్రభుత్వ ప్రాపకం ఉన్న ధనికులనుంచో భూములు, ఆస్తులు సంపాదించి ఆశ్రమం నిర్మించుకున్నాడు. స్వాతంత్య్రానంతరం దేశంలో ఇటువంటి దొంగ స్వాముల, బాబాల పరపతి బాగా పారిపోయింది. వాళ్ల ఆశ్రమాల మీద ఎటువంటి నియంత్రణా లేదు. ఎక్కడైనా ప్రభుత్వ, చట్టపరమైన నియంత్రణలను అమలు చేయవలసి వచ్చిన అధికారులు కూడా ఎన్నో సంజాం­షీలతో, క్షమాపణలు వేడుకుంటూ ఆ ఆశ్రమాలలో ప్రవేశిస్తారు. చివరికి ఆశ్రమాల వ్యవహారాలను పర్యవేక్షించవలసిన అధికారులు ఆ బాబాల, స్వాముల భక్తులుగా మారిపోయి ­, వారు చేసే దొంగ పనులన్నిటినీ మాఫీ చేస్తూ వారిని కాపాడుతూ ఉంటారు.

భారతదేశంలోనూ, శ్రీలంకలోనూ ఉన్న ఇటువంటి దొంగస్వాముల, బాబాల బండారం బయటపెడుతూ అబ్రహం కోవూర్‌ గొప్ప ఉద్యమం నడిపారు. ప్రజల మీద బ్రాహ్మణులు రుద్దిన ఇటువంటి మూఢాచారాల తప్పుడు పనుల మత వ్యవహారాల మీద తమిళనాడులో పెరియార్‌ ఇ వి రామస్వామి నాయకర్‌ మేధోస్థాం­లో పెద్ద ఆందోళన చేశారు. ఆయన నడిపిన ఆత్మగౌరవ ఉద్యమం ఇటువంటి మూఢాచారాలకు వ్యతిరేకంగానే. ఆ తర్వాత అన్నాదొరై కూడా ఆ ఉద్యమపు ప్రభావాన్ని కొనసాగించారు. తమిళనాడులో ప్రేమానందకు వ్యతిరేకంగా న్యాయపోరాటం నడవగలిగిన నేపథ్యం ఉండినది. అందువల్లనే బాలారిష్టాలన్నీ దాటుకుని ప్రేమానంద కేసు ముందుకు నడిచింది. నిజానికి అటువంటి దొంగస్వాము­ల మీద కేసు నమోదు చేయడం, ఆ కేసు విచారణ ముందుకు నడిపించడం చాలా కష్టసాధ్యమన, అసాధ్యమైన పనులు.

ఈ కేసులో వాస్తవాలు చాలా సులభమైనవి. జీవితం నిండా ఎన్నో అనిశ్చితలు. ఎంతో అశాంతి నిండి ఉన్న మధ్య తరగతి ప్రజలు ఎందరో తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని, తమ అశాంతిని పోగొట్టుకోవాలని బాబాల దగ్గరికి, స్వాముల దగ్గరికి వెళుతూ ఉంటారు. వారి జీవితాలలో ఎప్పుడూ ఉండే అభద్రతా భావం వారిని అనివార్యంగా బాబాల, స్వాముల పాదాల దగ్గరికి చేరుస్తుంది. ఇటువంటి ప్రజానీకానికి ఉపశాంతిని కలిగించడంలో, ఊరట ఇవ్వడంలో సాంప్రదాయిక మఠాలు, పాత మతాచారాలు, గుళ్లూ గోపురాలూ ఇటీవల విఫలమవుతున్నాయి ­. ఇక రామకృష్ణ మిషన్‌, స్వామి దయానంద, చిన్మయ మిషన్‌ వంటి ప్రయత్నాలేమో వారికి హిందూ తత్వశాస్త్రాన్ని బోధిస్తూ జీవితంపట్ల తాత్విక దృక్పథం ఏర్పరచుకొమ్మని చెబుతున్నాయి ­. కాని సాధారణ ప్రజానీకానికి ఈ తాత్విక దృక్పథం తలకెక్కడం కష్టం. అదంతా సుదీర్ఘ కాలంపట్టే వ్యవహారం. ఆ సుదీర్ఘ కాలంలో మనం చచ్చి ఊరుకుంటాం.

అందువల్ల ఇటువంటి ప్రజల కోసం తక్షణ ఉపశమనాలు ఇచ్చే, ఆరోగ్యాలు బాగు చేసే, ఆర్థిక వృద్ధికి దారి తీసే ఉపదేశాలు కావాలి. ఆ తక్షణ మత అవసరం నుంచే దొంగస్వాము­లు, అమ్మలు, బాబాలు పుట్టుకొస్తున్నారు. ఆ విధంగానే ఎన్నో ఆధ్యాత్మిక కేంద్రాలు పుట్టుకొస్తున్నాయి. ఆ కేంద్రాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి ­. ఆ కేంద్రాలకు పరుగులుపెట్టే భక్తులు ఆ కేంద్రాల సంపదను కూడా పెంచుతున్నారు. అందువల్ల ఆ కేంద్రాలలో భక్తులకు సహకరించడానికి అత్యాధునిక సౌకర్యాలు కూడా తయారవుతున్నాయి ­. ఆ కేంద్రాలు వైద్యులను, ఇతర నిపుణులను కూడా సమకూర్చుకుని భక్తులకు అన్ని రకాల సేవలూ అందిస్తున్నాయి ­.
ఈ మత, ఆధ్యాత్మిక, ధార్మిక సంస్థలకు కూడా దేశంలోని సివిల్‌, క్రిమినల్‌ చట్టాలన్నీ వర్తిస్తాయని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. కాని అవి చట్టానికీ, అధికారానికి అతీతమైన సంస్థలన్నట్టుగా ప్రవర్తిస్తుంటాయి ­.
ఈ మత, ధార్మిక, ఆధ్యాత్మిక సంస్థలుగా పేరు పెట్టుకున్న ఫక్తు వ్యాపార సంస్థలు దేశంలోని అన్ని సివిల్‌, క్రిమినల్‌ చట్టాలకు లోబడి పని చేయవలసి ఉన్నప్పటికీ, అవి తమకు చట్టమంటే లెక్కలేనట్టు ప్రవర్తిస్తుంటాయి . ఎందుకంటే ఈ సంస్థల అధిపతులు రాజకీయ, పాలనా రంగాలలోని ప్రముఖుల మీద తిరుగులేని అధికారాన్ని చలాయి­స్తుంటారు. ఈ సంస్థల లోపల ఉండే భక్తుల మీద, అనుచరుల మీద, సిబ్బంది మీద ఈ సంస్థల అధిపతులకు సంపూర్ణ అధికారం ఉంటుంది. అందువల్ల ఈ సంస్థల లోపల దారుణమైన అన్యాయాలు, క్రూరత్వ సంఘటనలు వెలుగు చూసినప్పుడు ప్రభుత్వ సంస్థలేమో ఆ మతాధిపతులను సాధారణ చట్టాల ప్రకారం విచారించక తప్పదు. న్యాయస్థానాలు ఆ నేరాలను సాధారణ నేరాలుగా పరిగణించి విచారించక తప్పదు. బలమైన సాక్ష్యాధారాలుంటే శిక్షలు విధించకా తప్పదు. ఐతే ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు, రాష్ట్రాల గవర్నర్లు, కింది కోర్టుల నుంచి సుప్రీం కోర్టు దాకా ఎందరో న్యాయమూర్తులు మాత్రమే కాదు, ఈ దేశానికి రాష్ట్రపతులుగా పని చేసిన వారందరూ ఈ ఆధ్యాత్మిక గురువుల భక్తపరమాణువులే గనుక ఆ ఆధ్యాత్మిక గురువులు ఎటువంటి నేరాల నుంచి అయినా తప్పించుకోగలుగుతున్నారు.

న్యాయశాస్త్ర భావనల వైపు నుంచి చూసినప్పుడు ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో అధిపతికీ, భక్తులకూ మధ్య అసమాన సంబంధం కొనసాగుతుంది. ఆ అసమాన సంబంధంలో భక్తులకు గురువుపట్ల మితిమీరిన నమ్మకం ఉండగా, గురువుకు మాత్రం ఆ నమ్మకాన్ని తన స్వప్రయోజనాల కొరకు వినియోగించుకునే అపారమైన ప్రభావం కనపడతాయి. ఈ అసమాన సంబంధం వల్ల అక్కడ జరిగే ఏ పని అయినా ఆ ప్రభావపు మాయ చేత కప్పబడి ఉంటుంది. మొ­త్తానికి ఇటువంటి సంబంధాన్ని పరస్పర నమ్మకం గల సంబంధంగా న్యాయశాస్త్రం భావిస్తుంది. ఈ పరస్పర నమ్మకంలో ఒక పక్షం మితి మీరిన ప్రభావాన్ని కలగచేసినప్పుడు ఆ పక్షం దాన్ని తన స్వప్రయోజనాల కొరకు, అనుచితంగా వినియోగించుకునే అవకాశం ఉంది. ఇటువంటి సంస్థల గురించి ఆలోచించేటప్పుడు ఆ అసమాన సంబంధం గురించి, అందువల్ల అక్కడ జరిగే పనుల అసహజత్వం గురించి తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. అయితే ఇంత వరకూ అటువంటి పరిగణన జరగలేదు. ప్రేమానంద ఆశ్రమంలో రెండు రకాల సంబంధాలు కొనసాగుతుండేవి. తన దగ్గరికి వచ్చిన దేశీ, విదేశీ భక్తులతో ఆయన చాలా నాగరికమైన సంబంధాలు పాటించేవాడు. ఆయన ప్రదర్శిస్తున్న నైతిక వర్తనను, రుజువర్తనను, సర్వసంగ పరిత్యాగాన్ని చూసి ఆ భక్తులందరూ తన్మయులైపోయేవారు. కాని ఆ ఆశ్రమంలోనే ఉండే భక్తులుగా, సిబ్బందిగా పని చేసే బాలికలతో,యు­వతులతో ఆయన తన వికృతమైన కామవాంఛలు తీర్చుకునే వాడు. ఆ యు­వతులు, బాలికలు సాధారణంగా అనాథలు, నిరాశ్రితులు.

Leave a Reply