హైసియా, మోంట్ గోమరీ కౌంటీ అవగాహనా ఒప్పందం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 01 : సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్(హైసియా), మేరీలాండ్లోని మోంట్ గోమరీ కౌంటీ అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆ సంస్థల ప్రతినిధులు బుధవారం నగరంలో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఒప్పందంలో భాగంగా హైదరాబాద్, మోంట్ గోమరీ కౌంటీ మధ్య స్టార్టప్, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ ను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందం కుదుర్చుకోవటంలో సిగ్నిటీ టెక్నాలజీస్ కీలక పాత్ర పోషించిందన్నారు. ఒప్పందంపై సిగ్నిటీ చైర్మన్, ఎండీ సీవీ సుబ్రమణ్యం సమక్షంలో హైసియా ప్రెసిడెంట్ మనీషా సాబు, మోంట్ గోమరీ కౌంటీ ఎగ్జిక్యూటివ్ మార్క్ ఎల్రిచ్ సంతకాలు చేసినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *