హైదరాబాద్, ఫిబ్రవరి 22 : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం హైదరాబాద్‌లో మొక్కలు నాటారు. మొత్తం మూడు మొక్కలు నాటి వాటికి నీళ్లు పోసారు. కంగనా రనౌత్ మొక్కలు నాటిన సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలను..
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ ట్విటర్లో షేర్ చేశారు.’దట్స్ అమేజింగ్ కంగనా రనౌత్ జీ..! గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటినందుకు చాలాచాలా కృతజ్ఞతలు. రు ఇవాళ చేసిన గొప్ప కార్యాన్ని చూసి పాన్ ఇండియా వ్యాప్తంగా ఉన్న అభిమానులు కూడా మిమ్మల్ని అనుసరిస్తున్నారని భావిస్తున్నా. మంచి భవిష్యత్ ప్రయోజనాల కోసం మొక్కలు నాటుతారని ఆశిస్తున్నా’ అని ఎంపీ సంతోష్ కుమార్ ట్విటర్లో పేర్కొన్నారు.



