హైదరాబాద్,ప్రజాతంత్ర,జూలై31:
రామంతపూర్, అంబర్ పేట్, మలక్పేట్, హిమాయత్ నగర్, ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజిగూడ పరిసర ప్రాంతాల్లో వర్షం పడింది. అంతేకాకుండా అర్ పేట్, ఎస్ఆర్ నగర్, సనత్ నగర్ పరిసర ప్రాంతాల్లోనూ వర్షం దంచికొట్టింది. ఇక ఉద్యోగులు, విద్యార్థులు ఇళ్లకు చేరుకునే సమయం కావడంతో మరోసారి ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడింది. సచివాలయం ప్రాంతంలో భారీ వర్షం పడడంతో రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. దీంతో మరోసారి సెక్రెటరియేట్ ముందు వర్షపు నీరు నిలిచింది. ఆఫీసులు ముగించుకుని ఇంటికెళ్లే సమయంలో వర్షం పడడంతో ఉద్యోగులు, వాహనదారులు అసౌకర్యానికి గురయ్యారు. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయ మయ్యాయి. దీంతో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. నెమ్మదిగా వాహనాలు కదలడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు..




