- ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడి మర్డర్
- రెక్కీ నిర్వహించి దూలపల్లిలో ఉన్న యువకుడిపై దాడి
- పెళ్లి చేసుకున్న యుతి కళ్లముందే నరికివేత
హైదరాబాద్,ప్రజాతంత్ర,మార్చి
అప్పుడు నివాసం మార్చిన హరిశ్.. యువతితో ప్రేమను కొనసాగించాడు. కొన్నాళ్ల తర్వాత ఆమెను పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే, పెద్దలకు తెలియకుండా వివాహం చేసుకున్న ఈ జంట.. ఎవరి ఇంట్లో వాళ్లు ఉంటూనే అప్పుడప్పుడూ కలుసుకుంటున్నారు. వీరిద్దరిపై నిఘా పెట్టిన యువతి కుటుంబసభ్యులకు పెళ్లి చేసుకున్నారన్న విషయం తెలిసింది. ఈ క్రమంలో తమ బిడ్డను తమకు కాకుండా చేశాడన్న హరీష్ అడ్డు తొలగించుకోవాలని పథకం వేశారు. ఇందులో భాగంగా హరీష్, ఆ యువతి కదలి కలపై నిఘా పెట్టి అదును కోసం ఎదురు చూశారు. దూలపల్లి ఆంజనేయ స్వామి ఆలయం సపంలో వీరిద్దరిని చూసిన బంధువులు ఒక్కసారిగా ఎటాక్ చేశారు. దూలపల్లిలో నడిరోడ్డుపై ఆమె ముందే హరీష్‌ను పాశవికంగా హత్య చేసి.. అనంతరం ఆ యువతిని తమ వెంట తీసుకెళ్లిపోయారు. వేరే వర్గానికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడన్న కారణంతోనే తమ కుమారుడిని హత్య చేశారని హరీశ్ కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు.
దర్యాప్తులో భాగంగా యువతి కుటుంబసభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే, హరీశ్‌ను వారే హత్య చేసినట్లు పేర్కొన్నారు. హరీష్ .. గత కొంతకాలంగా ఎల్లారెడ్డిగూడలోని ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయం తెలిసి యువతి కుటుంబ సభ్యులు పద్ధతి మార్చుకోవాలంటూ హరీష్ ను హెచ్చరించారు. ఈ క్రమంలోనే 10 రోజుల క్రితం ఆమెను తీసుకెళ్లి.. పెళ్లి చేసుకున్నాడు. యువతి తమ కుటుంబ సభ్యులను ఎదిరించి హరీష్ ను పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ కొత్తకాపురం పెట్టి ఉంటున్నారు. గత 10 రోజుల నుండి హరీష్ కోసం సూరారంలోని అన్ని కాలనీల్లోనూ యువతి కుటుంబ సభ్యులు వెతికారు. అయినా ఎక్కడా ఆచూకీ లభించలేదు. గత నెల 24వ తేదీన యువతి కుటుంబ సభ్యులు, బంధువులు సుమారు 30 మంది హరీష్ ఇంటి వద్ద గొడవ చేసినట్లు సమాచారం. మార్చి 1వ తేదీన హరీష్ తన సోదరి ఉంటున్న దూలపల్లి ప్రాంతానికి వెళ్లాడు. యువతి కుటుంబ సభ్యులు రెక్కీ నిర్వహించి హరీష్ ను బుధవారం రాత్రి 9 గంటల సమయంలో రోడ్డుపై దారుణంగా హత్య చేసి.. పారిపోయారు. హరీష్ ఫ్రెండ్ ద్వారా సమాచారం తెలుసుకున్న యువతి బంధువులు.. రెక్కీ నిర్వహించి చంపేశారు.




