జీవిత కుసుమానికి
పరిమళదాయకం,
జీవనాన్ని పరిమళభరితం చేసే
దివ్యౌషధం నవ్వు.
విప్పారిన పెదవుల నవ్వుల జడిలో
గుండెవేదన మటుమాయం,
రుగ్మతలు బహుదూరం .
వైరిని మైత్రిగ మార్చే
హాస్యపు జల్లుల జడితో
ముఖవర్ఛస్సు పెరిగి
వలపు వికసించి,
మనసు ఉల్లాసం,
హరివిల్లు దర్శనం.
రోగనివారణ తంత్రమై
బీజాక్షరాలు లేని మంత్రమై
ఎలాంటి కష్టాన్నాయినా
మరిపించి,మురిపించగలిగే
గమ్మత్తైన తాయెత్తయిన నవ్వు
అనుబంధాలను,ఆప్యాయతలను
గట్టిపరుస్తుంది.
అందుకే ఓ మనిషీ!
ఎవరికోసం ఆగని,
మంచులా కరిగిపోయే కాలవాహినిలో
బాధల హాలాహలం
గుండెల్లో దాచుకొని,
సుఖాల అమృతం పంచే,
మోవిపై లాస్యం చిగురింపచేసే
చిరునగవుతో
కార్యోన్ముఖుడివై సాగిపో…
గెలుపు గుర్రం అధిరోహించు.
వెలిగిపో జీవన పయనంలో,
ఎదిగిపో రోజు రోజుకు…
– వేమూరి శ్రీనివాస్
9912128967
తాడేపల్లిగూడెం




ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల