– ఇరాన్ పై తీవ్ర పదజాలంతో విమర్శలు
– లేదంటే సర్వనాశనం చేస్తానని ట్రంప్ వార్నింగ్
– లెక్క చేయకుండా ప్రతిదాడులకు దిగుతోన్న ఇరాన్
వాషింగ్టన్, ఏప్రిల్ 6: అమెరికా అధ్యక్షుడు డొ నాల్డ్ ట్రంప్ ఇరాన్ పై బూతులతో రెచ్చిపోయారు. తాను ఎంతగా హెచ్చరించినా హార్ము జ్ జలసంధిని ఇరాన్ తెరవకపోవడంతో ట్రం ప్ తీవ్ర ఆవేశానికి లోనయ్యారు. ఈ సం దర్భంగా తన సోషల్ డియా అకౌంట్ ట్రూత్ వేదికగా ఇరాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. హార్ముజ్ జలసంధిని తెరవకుంటే ఇరాన్పై భీకర దాడులు తప్పవని హెచ్చరించారు.మం గళవారం పవర్ ప్లాంట్ డే. బ్రిడ్జి డే. అన్నీ కలిపి ఇరాన్లోనే జరుగుతాయి. దీనికేదీ సా టిరాదు. హార్ముజ్ జలసంధిని తెరవండి.. లేకుంటే ఇరాన్లో కాదు. నరకంలో ఉన్నట్లే. చూస్తూ ఉండండి. అల్లాను ప్రార్ధించండి అంటూ ట్రంప్ పేర్కొన్నాడు. అంతేకాదు.. ఇందు కోసం రాయలేని రీతిలో బూతు పదాల్ని వాడాడు. హార్ముజ్ జలసంధిని 48 గంటల్లో గా తెరవాల్సిందే అని ఇరాన్కు ఇప్పటికే ట్రం ప్ హెచ్చరిక జారీ చేసిన సంగతి తెలిసిందే. తాను చెప్పినట్లు చేయకపోతే ఇరాన్లోని బ్రిడ్జి లు, పవర్ ప్లాంట్లపై దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. తీవ్రంగా గాయపడిన తమ ఎఫ్-15 యుద్ధ విమాన సిబ్బందిని ఇరాన్లోని పర్వత ప్రాంతాల నుంచి రక్షించా మని అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు. పగటిపూటే.. దాదాపు ఏడు గంటలపాటు శ్రమించి ఈ రెస్క్యూ ఆపరేషన్ చేశామన్నారు. పౌరు లకు, విమానాలకు ఎక్కువ ప్రమాదం ఉండే ఇలాంటి ఆపరేషన్ చాలా అరుదని చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


