హస్తంలో అసమ్మతి

హస్తాన్ని మోస్తున్న పాత కాపుల్లో..
తొండ ముదిరి ఊసరవెల్లి ఐనట్లు..
అసంతృప్తి ముదిరి అసమ్మతి సెగలు
భట్టి ఇంట్లో ఎగిసిన నిరసన కుంపట్లు
పాత తరం కాంగీలను పక్కనబెట్టి..
‘గోపీ’లనే అందలమెక్కిస్తున్నారంటూ..
‘సేవ్‌ ‌కాంగ్రేస్‌’ ‌పోరు బాట నినాదాలు
రేవంత్‌ ‌తీరును ఎండగట్టే ముసలాలు
హస్తం పెద్దల హస్తినాపుర పయనాలు
ఓటరు ఆదరణ తరుగుతున్న తరుణాన..
చేతికి జనాకర్షణ మందు ఎక్కించలేక..
అంతర్గత విభేదాలతో మునుగుతున్న..
హస్త నావను అధికార ఒడ్డుకు చేర్చేదెవరు !

–  డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
కరీంనగరం – 9949700037

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *