చిన్నకోడూరు,ప్రజాతంత్ర,అక్టో బర్ 12: మంత్రి తన్నీరు హరీష్ రావుకు ఓటు వేస్తామని మండల పరిధి రామునిపట్ల గ్రామ మహిళా సంఘం సభ్యులు ఏకగ్రీవం చేసిన తీర్మాన పత్రాన్ని గురువారం గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ కు అందచేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… రాబోయే ఎన్నికల్లో సిద్దిపేట బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి హరీష్ రావుకు ఓటు వేస్తామని తమ మద్దతు హరీష్ రావుకు అంటూ మహిళా సంఘం సభ్యులు ఏకగ్రీవ తీర్మాన పత్రాన్ని అందజేశారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో హరీష్ రావును లక్ష 50 వేల ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి మండల అధ్యక్షుడు గుజ్జ రాజు, గ్రామ శాఖ అధ్యక్షుడు పంతం శ్రీనివాస్,నాయకులు మిట్టపల్లి గణేష్,కట్కూరి శ్రీనివాస్, మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.
హరీష్ రావుకే మా మద్దతు మహిళా సంఘం సభ్యుల ఏకగ్రీవ తీర్మానం





