హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 9 : ‘‘ప్రజాతంత్ర’’ 2005-2006 సం.లలో 100 వారాలు ప్రచురించిన ..‘వీక్షణం’ సంపాదకుడు ఎన్. వేణుగోపాల్ అక్షరీకరించిన కెజి కన్నబిరాన్ ఆత్మకథాత్మక సామాజిక చిత్రం ‘24 గంటలు’.. కల్పనా కన్నబిరాన్ ఇంగ్లీష్‌లో అనువదించగా ‘The Speaking Constitution’ పేరుతో అంతర్జాతీయ ప్రచురణ సంస్థ Harper Collins ప్రచురించి పుస్తక రూపంలో ఈ రోజు సా.4-6 మధ్య హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఆవిష్కరించనున్నారు.
దేవులపల్లి పబ్లికేషన్స్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ‘ప్రజాతంత్ర’ ప్రచురణ కర్త సమన్వయ కర్తగా ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నిఖిలేశ్వర్ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. వక్తలు ప్రొఫెసర్ కంచ ఐలయ్య, ప్రొ .జీ.హరగోపాల్, వీక్షణం పత్రిక సంపాదకులు ఎన్. వేణుగోపాల్ పాల్గొనే ఈ సభలో ఇంగ్లీష్‌లో పుస్తక అనువాద కర్త, ఎడిటర్ కల్పన కన్నబిరాన్ తమ అనుభవాలను వ్యక్తపరచనున్నారు.



