స్విమ్స్‌లో వైద్య పరికరాలకు ఐవోసి రూ. 22కోట్ల విరాళం

ఈవో ఏవి ధర్మారెడ్డి సమక్షంలో ఎంవోయూ
తిరుపతి, ఫిబ్రవరి 4 : స్విమ్స్‌లో వైద్య పరికరాల కొనుగోలు కోసం ఇండియన్‌ ఆయిల్‌ ‌కార్పొరేషన్‌ ‌లిమిటెడ్‌ ‌రూ. 22 కోట్లు విరాళంగా అందించేందుకు ముందుకొచ్చింది. టీటీడీ పరిపాలన భవనంలోని ఈవో ఛాంబర్‌ ‌లో ఈవో ఏవి ధర్మారెడ్డి సమక్షంలో ఐఓసీఎల్‌ ,‌స్విమ్స్ అధికారులు ఈ మేరకు ఎంఓయూ కుదుర్చుకున్నారు.ఈ సందర్భంగా ఇండియన్‌ ఆయిల్‌ ‌కార్పొరేషన్‌ ‌లిమిటెడ్‌ ‌మార్కెటింగ్‌ ‌డైరెక్టర్‌ ‌సతీశ్‌ ‌కుమార్‌ ‌మాట్లాడుతూ స్విమ్స్ ‌లో రోగులకు వైద్య సహాయం అందించడానికి కార్పొరేట్‌ ‌సామాజిక బాధ్యతగా ఈ నిధులను అందించడం సంతోషంగా ఉందన్నారు.

ఈ సందర్భంగా ఈవో ఏవి ధర్మారెడ్డి టీటీడీ తిరుమలలో భక్తులకు, సిమ్స్, ‌బర్డ్, ‌చిన్న పిల్లల ఆసుపత్రుల్లో రోగులకు అందిస్తున్న సేవలను వివరించారు. తిరుపతి ఎంపీ డాక్టర్‌ ‌గురుమూర్తి, జేఈవో సదా భార్గవి, సిమ్స్ ‌డైరెక్టర్‌ ‌డాక్టర్‌ ‌వెంగమ్మ, ఎఫ్‌ఏసీఏవో బాలాజీ, సిమ్స్ ‌మెడికల్‌ ‌సూపరింటెండెంట్‌ ‌డాక్టర్‌ ‌రామ్‌, ఐఓసీఎల్‌ ఏపీ, తెలంగాణ ఇన్‌చార్జి అనిల్‌ ‌కుమార్‌, ‌రాయలసీమ రీజనల్‌ ‌హెడ్‌ ‌రోహిత్‌ ‌కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *