స్థలం కేటాయించాలని మంత్రిని కలిసిన ఫోటో వీడియో గ్రాఫర్ యూనియన్ సభ్యులు

కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్ట్ 16 : ఎన్నో సంవత్సరాలుగా ఫోటో వీడియో గ్రాఫీ ఫై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నామని తమకు గత ప్రభుత్వాల ద్వారా ఎలాంటి సహాయం పొందలేదని తమకు మండల కేంద్రంలో 500 గజాల స్థలాన్ని కేటాయిస్తే తామందరం సమావేశాలు నిర్వహించేందుకు అనుకూలంగా ఉంటుందని కందుకూరు మండలం ఫోటో అండ్ వీడియోగ్రఫీ యూనియన్ అధ్యక్షులు పురుషోత్తం విద్యాశాఖ మంత్రి సబితారెడ్డిని ఆమె నివాసంలో ఫొటో గ్రాఫర్లు కలసి కోరారు.మండల ఫోటోగ్రాఫర్ & వీడియో గ్రాఫర్లు అసోసియేషన్ అధ్యక్షులు పురుషోత్తం మాట్లాడుతూ,ఫోటోగ్రాఫర్ల యూనియన్ కోసం 500 గజాల స్థలం కేటాయించమని వినతి పత్రం విద్యాశాఖ మంత్రికి ఇవ్వడం జరిగిందని తెలిపారు.దీనికి మంత్రి సానుకూలంగా ప్రతిస్పందిస్తూ తప్పకుండా స్థలం కేటాయిస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు.భవన నిర్మాణానికి నిధులు కేటాయించమని కోరడం జరిగిందన్నారు. మంత్రిని కలసిన వారిలో ఉపాధ్యక్షుడు ఏ. చందు,ప్రధాన కార్యదర్శి టి.హరి ప్రసాద్,ఎం.నరసింహ,డి.రాకేష్ రెడ్డి,బి. శ్రీకాంత్,పి.సత్యనారాయణ.బొక్క శ్రీధర్ రెడ్డి,రాములు,సుధాకర్ చారి,మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *