కుల్కచర్ల/చౌడాపూర్, ప్రజాతంత్ర,డిసెంబర్ 09: సోనీయగాంధి జన్మదిన వేడుకల సందర్భంగా ఆరు గ్యారంటీ పథకల్లో రెండు గ్యారంటీలు అమలు చేస్తోందని డిసిసి జిల్లా ఉపాధ్యక్షుడు బొలుసాని భీంరెడ్డి బ్లాక్ బి అధ్యక్షుడు భారత్ కుమార్ అన్నారు.శనివారంనాడు మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు.. ఆరు గ్యారంటీ సంక్షేమ పథకాలు పగడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది అందులో రెండు గ్యారంటీలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,ఆరోగ్యశ్రీ పథకాలను ప్రారంభించిన సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు.గత పాలకుల హయాంలో రాష్ట్ర ప్రజలు, కవులు,కళాకారులు, మేధావులు,ప్రజా సంఘాలు అందరూ చాలా ఇబ్బంది పడ్డారు అందుకే రాష్ట్రంలో ప్రజలు సంపూర్ణమైన మెజారిటీతో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఆంజనేయులు,ఇప్పయిపల్లి సర్పంచి బాల్ రెడ్డి,రవి మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
సోనీయగాంధి జన్మదిన వేడుకల సందర్భంగా ఆరు గ్యారంటీల్లో రెండు పథకాలు అమలు





