సేవాలాల్ మహారాజ్,మేరమయాడిలకు ఘనంగా పూజలు

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 18 : మండల పరిధిలోని మాన్యగూడ తండాలో శ్రీ సేవాలాల్  మహారాజ్,మేరమయాడిల ఫోటో,జెండాపెట్టి మొదటి పూజ ఘనంగా చేయడం జరిగింది.సేవాలాల్ మహారాజ్ యూత్ అసోసియేషన్ ఆద్వర్యంలో బంజార పద్ధతిలో పూజలు చేయడం జరిగింది.తండా ప్రజలందరూ పూర్తిగా సహకరించారని సభ్యులు తెలిపారు.నీళ్ల బిందెలు ఎత్తుకొని మెరమయాడి,సేవాలాల్ మహారాజ్ బంజారా ద్వారంలో నీళ్లతో శుభ్రం చేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో బానావత్ రమేష్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ,బంజారా సంప్రదాయాలు,సంస్కృతులు ఎలా ఉంటాయో తెలియజేశారు.ఈ సంవత్సరం గుడి మొదటి పూజ ప్రారంభించి వచ్చే సంవత్సరం మళ్లీ ఇదే సమయానికి దసరా కన్నా ముందే గుడి కట్టించి పూజ ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో  సేవలల్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు బానావత్ వినోద్,ఉపాధ్యక్షుడు బానావత్నరేష్ ,కార్యదర్శి బానావత్ వెంకటేష్, సంయుక్త కార్యదర్శి బానావత్ రమేష్, సలహాదారుడు ఆంబోతు కళ్యాణ్,వ్యవస్థ ఇంచార్జ్ శ్రీకాంత్,యూత్ సభ్యులు శ్రీను, కుమార్,కృష్ణ,శ్రీను,సామ్య,శంకర్,శీను,రాజు,పంతుల,దేవేందర్,బాలు,గణేష్,చరణ్, భాస్కర్,ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *