‘‘ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో సెల్ఫీలకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇక ఎక్కడ చూసినా సెల్ఫీల ట్రెండ్ నడుస్తోంది. మొబైల్ చేతిలో ఉండటంతో యువత ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీ ఫొటోలు, సెల్ఫీ వీడియోలు తీసుకుంటారు. వాటిని తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తుంటారు. కానీ కొన్నిసార్లు సెల్ఫీలు పిచ్చితో ప్రాణాల మీదకు తెచ్చుకున్నవాళ్లు, ఏకంగా ప్రాణాలనే పోగొట్టుకున్న వాళ్లు చాలానే ఉన్నారు.’’
నేటి సమకాలీన ప్రపంచంలో యువత పుస్తకాలు, నోట్ బుక్స్ లేకుండా వుంటున్నారేమో కానీ స్మార్ట్ ఫోన్స్ లేకుండా ఉండటం లేదు. అంటే ఆండ్రాయిడ్ ఫోన్లకు అంతగా అలవాటు పడుతున్నారు నేటి యువత.ఇలాంటి ఫోన్లు వాడేవారిలో ఎక్కువ శాతం యువతే అయినప్పటికీ చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అందరూ ఈ ఫోన్లు వాడుతున్నారు.అయితే ఈ ఫోన్లను ఎక్కువగా, ఫేస్బుక్, వాట్సాప్, సెల్ఫీలు, ఫోటోలు, మెసేజ్ ఛాటింగ్లకు ఎక్కువగా వినియోగిస్తున్నారు.సెల్ఫీలు ముఖ్యంగా మానవుల యొక్క జీవన విధానంపై ఎంతగానో ప్రభావం చూపుతున్నాయి. చిన్నపిల్లలుమొదలుకొని పెద్దలు, ప్రజా ప్రతినిధులు మరియు ఉన్నత పదువులు ఉన్నవారు సైతం సెల్ఫీలకు ఫోజులిచ్చి, ఫేస్ బుక్ లో అప్లోడ్ చేస్తున్నారు తమ ఫోటోలు. అయితే ఈ ఫోటోలు ఎలా దిగుతున్నారు? అనే విషయానికొస్తే మంచి ఏ విధంగా జరుగుతుందో అంతే మోతాదులో చెడు కూడా జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.ఫోటో బాగా రావలని తమకు తాముగా ఎవరి సహాయం లేకుండా తీసుకునే ఫోటోనే ‘సెల్ఫీ’ చెట్టుపైన ఉన్న కాయలు పట్టుకున్నట్లు,ఆ ఫలాలనుతెంపినట్లు, చెట్లను తోసినట్టు ఫోటోలు దిగుతారు.
ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో సెల్ఫీలకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇక ఎక్కడ చూసినా సెల్ఫీల ట్రెండ్ నడుస్తోంది. మొబైల్ చేతిలో ఉండటంతో యువత ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీ ఫొటోలు, సెల్ఫీ వీడియోలు తీసుకుంటారు. వాటిని తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తుంటారు. కానీ కొన్నిసార్లు సెల్ఫీలు పిచ్చితో ప్రాణాల మీదకు తెచ్చుకున్నవాళ్లు, ఏకంగా ప్రాణాలనే పోగొట్టుకున్న వాళ్లు చాలానే ఉన్నారు. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు యువత ఎక్కడపడితే అక్కడ సెల్ఫీలు తీసుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతుంటారు.
ఈ సెల్ఫీ మోజు స్మార్ట్ ఫోన్ యూజర్లలో రోజురోజుకు ముదురుతోంది. ఫలితంగా కొన్నిసార్లు ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా రైల్వే ట్రాక్స్, స్టేషన్ల వద్ద సెల్ఫీ మోజులో పడి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు గతంలో ఎన్నో ఉన్నాయి. సెల్ఫీలలో చాలా రకాలు ఉన్నాయన్న విషయం మీకు తెలుసా.? సెల్ఫీల్లో చాలా రకాలు ఉన్నాయి. హెల్తీ సెల్ఫీ, వ్యాలిడేషన్ సెల్ఫీ, స్నాప్ హ్యాపీ సెల్ఫీ, యాంఫిటైజర్ సెల్ఫీ, విక్టరీ సెల్ఫీ అంటూ చాలా సెల్ఫీలను ఫాలో అవుతుంటారు యువత.
హెల్తీ సెల్ఫీ:
హెల్పీ సెల్ఫీ.. వినేందుకే కాస్త వెరైటీగా ఉన్నా.. ఈ సెల్ఫీ చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే.. సెల్ఫీలు కావాలంటే మనం కేవలం బయటకు వెళ్లినప్పుడు లేదా కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాత్రమే మన ఫ్రెండ్స్‌తో లేదా ఫ్యామిలీలో కలిసి తీసుకుంటాం. అందుకు భిన్నంగా ఉండే సెల్ఫీనే ఈ హెల్తీ సెల్ఫీ. ఇది కేవలం మనం ఆరోగ్యంగా హెల్తీగా ఉన్నామన్న విషయంను తెలిపేందుకే ఈ హెల్తీ సెల్ఫీలను దిగుతుంటాం. ఉదాహరణకు జిమ్‌లో తీసుకునే సెల్ఫీలు కానీ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే సెల్ఫీనే హెల్తీ సెల్ఫీ అంటారు. అంతేకాదు ఈ సెల్ఫీ తీసుకునే వ్యక్తి తన భిన్నమైన మానసిక స్థితిని చూపించడానికి ప్రయత్నించడం అని చెప్పొచ్చు. చాలామంది ఒంటరిగా ఉన్నప్పుడు తరచూ ఇలాంటి సెల్ఫీలు తీసుకుంటారు.
యాంఫిటైజర్ సెల్ఫీ:
ఈ రకమైన సెల్ఫీలు ఆసుపత్రిలో లేదా ఇబ్బందులు పడుతూ తీసుకునే సెల్ఫీలు అనే చెప్పాలి. జబ్బుపడినా, మందు తాగినా, ఇబ్బంది పడినా సెల్ఫీ తీసుకుంటే దాన్ని యాంఫిటైజర్ సెల్ఫీ అంటారు. వాస్తవానికి, ఈ సెల్ఫీని చూసిన తర్వాత, ప్రజలు మిమ్మల్ని ఓదార్చుతుంటారు.
విక్టరీ సెల్ఫీ:
పేరులోనే విక్టరీ ఉంది కాబట్టి, ఈ రకమైన సెల్ఫీలు ఏదైన గేమ్ లేదా ఏదైన సాధించిన సమయంలో మాత్రమే ఈ సెల్ఫీలు తీసుకుంటారు. జీవితంలో ఏదైనా సాధించి, కీలకమైన పాయింట్‌కి చేరుకుంటే, జాబ్ రావడం, ఉద్యోగంలో ప్రమోషన్, నేతలు ఎన్నికల్లో నెగ్గడం లాంటి ఎన్నో సందర్భాలలో విక్టరీ గుర్తుతో తీసుకునే సెల్ఫీని విక్టరీ సెల్ఫీ అంటారు.
డక్‌ఫేస్ సెల్ఫీ:
ఒక రకమైన ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ పెట్టడం లేదా బాతు, లేదా పిచ్చుక వంటి పక్షిలా ఎక్స్ప్రెషన్స్ పెట్టడమే డక్‌ఫేస్ సెల్ఫీ. అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటి వెరైటీ సెల్ఫీలు ట్రెండింగ్‌లోకి వచ్చాయి.
స్నాప్ హ్యాపీ సెల్ఫీ:
ఇది సెల్ఫీ తీసుకునే వ్యక్తి తన భిన్నమైన మానసిక స్థితిని చూపించడానికి ప్రయత్నించే సెల్ఫీ. ప్రజలు ఒంటరిగా ఉన్నప్పుడు తరచూ ఇలాంటి సెల్ఫీలు తీసుకుంటారు.
వ్యాలిడేషన్ సెల్ఫీ:
మీరు కొత్త హెయిర్ కట్ చేసుకునే ముందు ఆ తర్వాత తీసుకునే సెల్ఫీనే వ్యాలిడేషన్ సెల్ఫీ అంటారు. ఇది కాకుండా, అద్దంలో మీ కొత్త లుక్‌తో మీరు తీసుకునే సెల్ఫీని వాలిడేషన్ సెల్ఫీ అంటారు.ఇది ఇలా వుంటే మరికొందరైతే బిల్డింగ్ పై నుండి దాని చివరి అంచు వరకు వెళ్ళి క్రిందఉన్నవి కనిపించేటట్లుగా ఫోటోలు దిగుతారు.అలా దిగిన సందర్భాలలో చివరి అంచులో వారు నిల్చోని ఉన్నపుడు అదుపు తప్పి,క్రింద పడి తమ అమూల్యమైన ప్రాణాలను సైతం కోల్పోయారు.ఇంకా ఎక్కువగా చెఱువుల దగ్గరకు వెళ్ళి లేదా నదులు లేదా సముద్రాల ప్రక్కకి వెళ్ళి అందులో అనగా ప్రక్కన ఉన్న నీటిలో అక్కడక్కడ పాకురు పట్టిన బండలపై నిల్చొన సెల్ఫీలు, ఫోటోలు దిగాలని భావించి ఆ నీటిలో కొంత దూరం నడిచివెళ్ళి ఎలాగో అలాగా ఆ నీటి మధ్యలో ఉన్న బండరాయి దగ్గరకు చేరుతున్నారు.కాని అదే వారికి చివరి గడియలుఅనే విషయాన్ని మర్చిపోయి, బండపై నిల్చొని దిగాలనే సెల్ఫీ గురించి ఆలోచించే వ్యక్తులు వారి తల్లిదండ్రులకు చివరకు గుండెకోతను మిగులుస్తారనే విషయాన్ని మరిచిపోతున్నారు.

పాకురు పట్టిన బండపై నిల్చోని సెల్ఫీలు దిగేవారు ఫోటోలకుఫోజులిచ్చే సందర్భంలో బండపైన ఉన్న పాకురుపై కాలుపడినపుడు అది జారి అదుపు తప్పి లోతైన గుంతలో పడి తన ప్రాణాలను గాలికొ దిలేస్తున్నారు. రిజర్వాయర్ చూద్దామని చెప్పి పిక్నిక్ అని వెళ్ళి సెలబ్రేషన్స్, ట్రీట్ కోసమని వెళితే సెల్ఫీ తీసే క్రమంలో అదుపు తప్పి అందులో పడి ఈత రాక, కాపాడేవారు ఎవరు లేక తమ ప్రాణాలను కోల్పోయారు.అలాగే 2014 జూన్ 8వ తేదీన బియాస్ నదీ పరివాహక ప్రాంతాన్ని చూద్దామని వెళ్ళిన విజ్ఞాన జ్యోతి ఇనిస్టిట్యూట్ఆఫ్ ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ హైద్రాబాద్ లో చదువుతున్న 48 మంది ద్వితీయ సంవత్సర విద్యార్థులు మరియుఫ్యాకల్టీ కలిసి వెళ్ళిన టూర్ లో వద్దు నీటిలోకి వెళ్ళొద్దు అని చెప్పిన కాని వినకుండా నీటిలో మునిగి ఫోటోలు సెల్ఫీలు దిగే క్రమంలో కనుచూపు మేరలో రెప్పపాటులో అలలు వారి ఆయువుని కమ్మేశాయి.
అందులో 24 మంది విద్యార్థులు ఒక టూర్ ఆపరేటర్ మొత్తంగా 25 మంది తమ ప్రాణాలను కోల్పోయారు.డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటం ద్వారా కూడా కొన్ని వందల ప్రాణాలు గాలి లో కలుస్తున్నాయ్.కొన్ని రోజుల క్రితం హనుమకొండ జిల్లాలో వచ్చే ట్రైన్ తో సెల్ఫీ తీసుకుంటూ ట్రైన్ గుద్దడం ద్వారా యువకుడు గాయాల పాలు కావడం జరిగింది.ఇవే కాదు మన కళ్ళ ముందు కనపడే సెల్ఫీలు చూస్తే ప్రజా ప్రతినిధులతోనో, తాళ్ళు ఎక్కి గాలిలో సెల్ఫీ తీస్తూ కూడా గీతకార్మికులు పట్టుతప్పి చాలా ఎత్తు నుండి క్రిందకు పడి, చనిపోయిన సందర్భాన్ని మనం చూడవచ్చు.ఇంక కొందరైతే బైక్ నడుపుతూ ముందు కెమెరా ఆన్ చేసి తనకు తానుగా వీడియో చూస్తు,వీడియో తీస్తూ,ముందు నుండి వచ్చేవాహనాలను కాని, ఎదురుగా ఉన్న చెట్లను, కరెంటు పోళ్ళను గుద్ది చనిపోవడం చూస్తున్నాం.మరికొందరైతే వీడియో టాకింగ్ అనగా ఒకరినొకరు చూస్తూ మాట్లాడుకోవడం అనేవి చేసినపుడు ప్రక్కన ఏం జరుగుతుందో అర్థం కాక, మనం ఎలా వాహనాన్ని నడుపుతున్నామో తెలియక ఏమైన అవాంతరాలు కాని, ప్రక్కన వాహనాలు నేరుగా వచ్చినపుడు వాటిని గమనించక సెల్ఫీనే చూస్తూ ఎంజాయి చేస్తున్నాం తప్పితే, ఈ సెల్ఫీయే మన నిండు ప్రాణాలను మనతో పాటు ఇతరులకు కూడా హాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఏది ఏమైనప్పటికి సెల్ఫీలు మనిషి అవసరం లేకుండా మనం ఫోటోలు తీసుకోవడానికే ఉపయోగపడుతుందే తప్పితే ఇంకా కొంచెం ప్రక్కకి జరిగితే ఇంకా మంచి ఫోటోను తీసుకోవచ్చు అని అనుకుంటే మాత్రం కొన్ని సెకన్లలో వారు అనేక ప్రమాదాలకు గురికాక తప్పడం లేదు.అందుకే సెల్ఫీతో జర భద్రం.ఒక వ్యక్తి సింహంతో సెల్ఫీ దిగుదామని చెప్పి గోడపైకి ఎక్కి సెల్ఫీ తీస్తుంటే కాలు జారి సింహం బోనులో పడి తన ప్రాణాలనుకోల్పోయిన విషయం మనకు తెలిసిందే.సెల్ఫీ తీసుకునేటపుడు నడి రోడ్డు మీద కాకుండా రోడ్డు ప్రక్కన తన వాహనాన్ని ఆపి సెల్ఫీ తీసుకుంటే తప్పులేదు.తద్వారా రోడ్డు ప్రమాదాలు అరికట్టవచ్చు. నీటికుంటలు, చెరువులు వంటి వాటి దగ్గర చివరి అంచుల వరకు వెళ్ళి సెల్ఫీలుదిగే సంస్కృతికి చమరగీతం పాడాలి.
మనిషికి ప్రమాదం అని తెలిసి కూడా ఆ ప్రమాదం జరిగే ప్రదేశాల దగ్గరి వరకు వెళ్ళకూడదు.అలా మన జాగ్రత్తలో మనం ఉంటేనే కొంతలో కొంత వరకైనా ప్రమాదాల బారి నుండి మనల్ని మనం రక్షించుకొంటాం,మనపై ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల ఆశయాలను తీరుస్తాం,కట్టుకున్న వారికి సైతం కడదాక తోడుండి వారి యొక్క,అలాగే మన పిల్లల యొక్క ఆలనా, పాలనా చూస్తాం! కాబట్టి సెల్ఫీతో జాగ్రత్త అవసరం అలాగే తెలిసిన వ్యక్తులతో సెల్ఫీ దిగితే ఏ నష్టం లేదు. కాని తెలియని వ్యక్తులతో సెల్ఫీలు దిగడం వల్ల అనర్థాలు కలుగుతాయి.కాబట్టి సెల్ఫీతో జాగ్రత్త మనకు మంచిది.
మోటె చిరంజీవి
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్. 9949194327