సెక్యులర్‌ వాదులను ఎన్నుకుందాం ..!

భారతదేశంలో ప్రజాస్వామ్య పండగ వేడుకలు ఏప్రిల్‌ 19వ తేదీన ఘనంగా ఆరంభమయ్యాయి. ఈ ప్రస్థానం జూన్‌ 1వ తేదీ వరకు కొనసాగుతుంది. ప్రజలు 18వ పార్లమెంటుకు తమకు ఇష్టమైన పార్టీకి వోట్లు వేసి గెలిపిస్తారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ తమ పార్టీ 400కు పైగా సీట్లు సాధించాలనే లక్ష్యంతో ప్రచారాన్ని ఉధృతం చేసింది. మరో పది రోజుల్లో చివరి దశ ఎన్నికలు ముగుస్తాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తరచుగా హిందువులు-ముస్లీముల మధ్య అగాధాన్ని పెంచే విధంగా, వారి మధ్య చిచ్చును పెట్టే  విధంగా విద్వేషపూరితమైన ప్రసంగాలు,  వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆవేశపూరితంగా మాట్లాడడం, ఇదేమిటని ప్రశ్నిస్తే తాను అలా మాట్లాడలేదంటూజాగ్రత్తగా, తెలివిగా ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నారు.

ఇటీవల కాలంలోబీజేపీ, ఆరెస్సెన్‌కు చెందిన అగ్రనేతలు చేస్తున్న కొన్ని ప్రకటనలు చూన్తున్నాం. బీజేపీకి ఈ సారి ఎన్నికల్లో భారీ మెజార్టీ లభిస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తామని, హిందూరాష్ట్రం  అనే పదాన్ని రాజ్యాంగ పీఠికలో చేరుస్తామనే ప్రకటనలు వింటున్నాం. ఇదే నిజమైతే, మతం, రాజకీయాలు పెనవేసుకుని పోతాయి. మనం ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ అనే పదాన్ని పొరుగున ఉన్న దేశాలు రాజ్యాంగంలో చేర్చడాన్ని చూశాం. ఆ దేశాల్లో ప్రజాస్వామ్యం బతికి ఉందా? అక్కడ ఎటువంటి పరిస్థితులున్నాయో నిత్యం అక్కడ చోటు చేసుకుంటున్న పరిణామాలు అందరికీ తెలిసిన విషయమే. మతం గురించి ఇక్కడ కొంత  విశ్లేషించాలి.  దైవత్వంతో  మతం ముడిపడి ఉంటుంది. ఒక సాంస్కృతిక, సామాజిక కోణంలో ఆలోచిస్తే ఆ సమూహంలో ఉండేవారు తాము నమ్ముకున్న విశ్వాసాలను, దానికి అనుగుణంగా కొన్నివిధానాలను ఆచరిస్తుంటారు. వారి మత విశ్వాసాలను ప్రశ్నించలేం. ఇవన్నీ ఊహాజనితమని బహిరంగంగా మాట్లాడలేం. ఇదంతా  నమ్మకంతో కూడిన అంశాలు. మతమంటే ఎవరు ప్రశ్నించలేని అంశాలతో ముడిపడి ఉంటుంది.వారి సామాజిక, ఆచార, వ్యవహారాలతో మతం కలగాపులగంగా కలిసిపోయి ఉంటుంది.

అందుకే మతనాయకులు, సామాజిక, రాజకీయాలను తమ ఉపన్యాసాలతో, మాటలతో ప్రభావితం చేస్తుంటారు. వీరు నమాజాన్ని శాషించే శక్తులుగా అవతరిస్తుంటారు. మరో కోణంలో విశ్లేషిస్తే మతం, సామాజిక పరివర్తన, సంస్కరణలను నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కాని అలా జరుగుతోందా ? మతనాయకులు, రాజకీయ నేతలు కలిసిపోయి, మత విశ్వాసాలతో ఉన్న ప్రజలపై ప్రభావం చూపించే విధంగా మాట్లాడుతుంటరు. రాజకీయ, ఆర్థిక పరమైన ప్రయోజనాలను పొందుతుంటారు. అధికారం కోనం రాజకీయ పరమైన అజెండాలను ముందుకు తీనుకు వస్తారు. దీనికి మతం అనే పునాదిగా మారుతుంది. అన్ని సమాజాల్లో మత నాయకులు సామాజిక, ఆర్టిక రాజకీయ వ్యవహారాల్లో తల దూర్చి నిర్మాణాత్మకమైన పాత్రవహిస్తుంటారు.  మతం ముసుగులో నమాజాన్ని తమ చెప్పు చేతుల్లో తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. మత నాయకులను శాషించే  స్థాయికి కొన్ని పార్టీలు, ఆ పార్టీ నేతలు ఎదుగుతారు. ఇరాన్‌లో 1979లో మతం కీలక పాత్రవహించి రాజకీయాధిరాన్ని చేజిక్కించుకుంది. ఆ తర్వాత ఏమైందో మనందరికీ తెలినిన విషయమే.

మన దేశంతో పాటు కొన్ని దేశాల్లో ఇటీవల కాలంలో రాజకీయ పార్టీలు మతపరమైన అజెండాను ముందుకు తెచ్చితాము చెప్పినట్లుగా సమాజాన్ని ప్రభావితం చేసి  అధికారాన్ని చేజిక్కించుకుంటున్న ఘటనలు చూన్తున్నాం. మతపరమైన  అజెండా ముందుకు వచ్చిందంటే, సమాజా న్ని రెండు ముక్కలు చేయాల్సిందే. ఈ తరహాఆలోచనలు, కుయుక్తులు, పన్నాగాలు కచ్చితంగా పవిత్రమైన ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కడమే. గణతంత్ర రాజ్యాంగానికి పాతరవేయడమే. ఇవన్నీ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలని చెప్పవచ్చును. మతం ప్రాతిపదికన సమాజాన్ని చీల్చరాదని, ఎవరి పట్ల వివక్షను ప్రదర్శించరాదని, రాజ్యానికి మతం లేదని, లౌకికదేశమని మన రాజ్యాంగ పెద్దలు ముందుగా యోచించి విశ్లేషించి దేశ రక్షణకు, ఆర్టికల్‌ 15ను చేర్చారు. 25వ అధికారణ ప్రకారం మత స్వేచ్చను ప్రసాదించారు.

అదే 51ఏ(ఇ) మతసామరస్యతను చాటుతోంది. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక భారత్‌ అని స్పష్టం చేస్తోంది. ఈ మూడు అధికరణలు విశ్లేషిస్తే  భారత్‌లో మతానికి, రాజ్యానికి సంబంధం లేదు. సెక్యులర్‌ దేశం. లౌకికత్వానికి భారత్‌ ప్రతీక.  భారత్‌ రాజ్యాంగంలో సెక్యులర్‌ ప్రధానమైనది. 1975లో రాజ్యాంగంలో సెక్యులర్‌ అనే పదం చేర్చినప్పటికీ, భారత్‌ సాంస్కృతిక  వునాదుల్లోనే లౌకికత్వం ఉంది. ఇప్పుడున్న సంక్షిష్ట పరిస్థితుల్లో  భారత్‌ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మతతత్వానికి తావులేకుండా లౌకికత్వాన్నిబలోపేతం చేస్తూ ధృడమైన భారత్‌ను నిర్మించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉంది. రాజ్యాంగంలోని 15, 25 అధికరణలను తూచా తప్పుకుండా పాటించే పార్టీలకు అధికారాన్ని అప్పగించే విధంగా మనం మసలుకోవాలి. ఆ దిశగా భారత సమగ్రత, లౌకికత్వాన్ని కాపాడుకోవాలి. ఇంతవరకు జరిగిన ఎన్నికల దశలను విశ్లేషిస్తే… బీజేపీకి 363 సీట్లు రావడం కష్టమేననే సంకేతాలు వెలువడుతున్నాయి. ఎన్నికల సంఘం కూడా పోల్కెన వోట్లపై కచ్చితమైన నమాచారం ఇవ్వడం లేదు. మొత్తంమీద పోల్కెన వోట్ల  వివరాలను అందిస్తోంది. ఎన్నికల సంఘం కూడా పారదర్శకతతో కూడిన విధానాలను అమలు చేయడం లేదు.పాక్షిక వైఖరితో నిర్ణయాలు తీసుకుంటోంది. సజావుగా ఎన్నికలు జరుగుతున్నాయనే నమ్మకాన్ని కలిగించడం లేదు.ఎన్టీఏ కూటమికి కనీస మెజార్టీ వచ్చి అధికారంలోకి వచ్చినా, బలమైన ప్రతిపక్షం ఉంటుందనే ఆశలు చిగురిస్తు న్నాయి. ఇది సాకారమైనప్పుడే, బలమైన ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పెద్దలు కన్న కలలు నిజమవుతాయి.

-మేజర్‌ జనరల్‌ ఎన్‌జీ వొంబాట్కిరీ
(‘ది వైర్‌’ సౌజన్యంతో…) 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *