సురవరం పార్థివ దేహానికి రాజా నివాళులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 23: సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి పార్థివ దేహానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, జాతీయ కార్యదర్శి నారాయణ, సయ్యద్‌ అజీజ్‌ పాషా, పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావులు శనివారం నివాళులర్పించారు. పార్టీ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకటరెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటి నరసింహ, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఛాయాదేవి, సంగారెడ్డి జిల్లా కార్యదర్శి సయ్యద్‌ జలాలుద్దీన్‌ తదితరులు కూడా నివాళులర్పించారు. అలాగే తెలంగాణ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ కె.శ్రీనివాసరెడ్డి కూడా సురవరం పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.


 

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండిరగ్‌ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్‌ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్‌ చానల్‌ను సబ్‌ స్క్రైబ్‌ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్‌ చేయడం మరిచిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *