కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 18 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని అపురూప కాలనీ, ఎస్.ఆర్ నాయక్ నగర్ లో బుధవారం మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ పర్యటించి స్థానికులతో సమావేశమయ్యారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చి, తనను గెలిపించాలని కోరారు. రెండు సార్లు కేపీ వివేకానందకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే దొంగ హామీలతో ప్రజలను మభ్యపెట్టారని, ఈసారి అతనికి బుద్ధి చెప్పాలని కోరారు. తనను గెలిపిస్తే కాలనీలో సమస్యలు పరిష్కరించి అత్యాధునిక మౌలిక సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎమ్మెస్ వాసు, కంది శ్రీరాములు, గుబ్బల లక్ష్మీనారాయణ, మల్లేష్ గౌడ్, బొబ్బ ప్రసాద్, కుమ్మరి శంకర్, అడబాల వెంకట రత్నం, రమణ, విగ్నేష్, అనుక్, మాలాద్రి, బీమరాజు, శ్రీనివాస్ గుప్తా, చంద్రశేఖర్, వల్లూరి ప్రసాద్, కులకర్ణి, బాబు గౌడ్, కాలనీ వాసులు తిప్పా రెడ్డి, గణేశన్, కుంచె కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
సుభాష్ నగర్ డివిజన్ లో పర్యటించిన కూన శ్రీశైలం గౌడ్




