కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, జులై 28 : వర్షం కారణంగా వచ్చే సీజనల్ వ్యాధులను అరికట్టడంతో పాటు, వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, పరిసరాల పరిశుభ్రతపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని గుబ్బల లక్ష్మీనారాయణ కోరారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ నూతన కమిషనర్ గా నియమితులైన నాగమణిని శుక్రవారం గుబ్బల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మిత్రులతో కలసి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేసారు. అనంతరం గుబ్బల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కాలనీలో, బస్తిలలో పలు సమస్యలు ఉన్నాయని వాటిని వేగంగా పరిష్కరించాలని కోరారు. వర్షాకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారుఅని అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. అలాగే సుభాష్ నగర్ లో నాళాలు కబ్జాకు గురయ్యాయని, కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. నాలాలలో కెమికల్ వ్యాపారులు కెమికల్ డంపింగ్ చేస్తున్నారని పద్యాలు చేసి వాటిని వ్యాపారాలకు ఉపయోగిస్తున్నారని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ ని కోరారు. సుభాష్ నగర్ డివిజన్ ఎస్ఆర్ నాయక్ నగర్, అపురూప కాలనీ, జనప్రియ అపార్ట్మెంట్స్ మోడీ అపార్ట్మెంట్స్లలో దోమలు బెదా ఎక్కువగా ఉందని, దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మల్లేష్ గౌడ్, కూరపాటి ప్రభాకర్, ఎస్కే అనొఖ్, శ్రీనివాస్ గుప్తా, కులకర్ణి, శివ తదితరులు పాల్గొన్నారు.




