సీఎస్‌, ఎక్సైజ్‌ ‌డైరెక్టర్‌కు హైకోర్టు ధిక్కార నోటీసులు

టాలీవుడ్‌ ‌డ్రగ్స్ ‌కోర్టులో ఈడీ దాఖలు చేసిన హైకోర్టు ధిక్కరణ పిటిషన్‌పై సీఎస్‌ ‌సోమేష్‌ ‌కుమార్‌, ఎక్సైజ్‌ ‌శాఖ డైరెక్టర్‌ ‌సర్ఫరాజ్‌ అహ్మద్‌కు నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ ఆరోపణలపై 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. టాలీవుడ్‌ ‌డ్రగ్స్ ‌కేసులో ఈడీ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. టాలీవుడ్‌లో గతంలో డ్రగ్స్ ‌వ్యవహారంలో నిందితులుగా ఎదుర్కొంటున్న వారికి సంబందించిన కాల్‌ ‌డేటా, డిజిటల్‌ ‌రికార్డులు తమకు ఇవ్వడం లేదని ఆరోపించింది.

దీనికి సంబంధించి హైకోర్టు ఆదేశించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని పేర్కొంది. దీనిలో భాగంగా సీఎస్‌, ఎక్సైజ్‌ ‌శాఖ డైరెక్టర్‌పై కోర్టు ధిక్కరణ శిక్ష విధించాలని కోరుతూ ఈడీ పిటిషన్‌ ‌దాఖలు చేసింది. దీనిపై తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 25కు వాయిదా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *