-కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు టిపిసిసి మైనార్టీ విభాగం ఉపాధ్యక్షుడు కలిముద్దీన్ అహ్మద్
సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈసారి అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు టిపిసిసి మైనారిటీ విభాగం ఉపాధ్యక్షులు కలిముద్దీన్ అహ్మద్ గాంధీమభవన్ లో దరఖాస్తు అందజేశారు.గత 35 సంవత్సరాల నుండి విద్యార్థి దశ నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ విధేయుడిగా ఉంటూ పార్టీ కొరకు సేవ చేస్తున్నాను. పార్టీ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో ఈ బీఆర్ఎస్ బిజెపి వ్యతిరేకంగా పోరాడుతున్నాను. ఈసారి సిద్దిపేట నియోజకవర్గం నుండి సీనియర్ మైనార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నాను అన్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ అధిష్టానాన్ని కట్టుబడి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీ అధికారం లేకున్నా పార్టీ కొరకు కష్టపడుతున్నాను. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం నామీద ఎన్నో కేసులు పెట్టి ఎన్నో ఇబ్బందులు పెట్టిన లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి శ్రమిస్తున్నాను. ఈసారి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కష్టపడి ప్రతి ఇంటింటికి తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 70 నుంచి 80 స్థానాలు కచ్చితంగా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం పతనం మొదలైనది మన అందరం కలిసికట్టుగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పూర్తి మెజారిటీ తో గెలిపించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.




