సికింద్రాబాద్‌ ‌రైల్వేస్టేషన్‌పై రోజురోజుకు పెరుగుతున్న రద్దీ

• లింగంపల్లి, కాచిచూగడ, హైటెక్‌ ‌సిటీ రైల్వేస్టేషన్లపై దృష్టి
• పలు స్టేషన్ల నుండి దూరప్రాంతాలకు రాకపోకలు సాగించేలా ప్రణాళికలు

హైదరాబాద్‌,‌సెప్టెంబర్‌11: ‌సికింద్రాబాద్‌ ‌రైల్వేస్టేషన్‌పై రోజురోజుకు తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. దీంతో లింగంపల్లి, కాచిచూగడ, హైటెక్‌ ‌సిటీ రైల్వేస్టేషన్ల నుంచి దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించేలా దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే లింగంపల్లి-విజయవాడ-లింగంపల్లి ఎంప్లాయిస్‌ ‌ట్రైన్‌, ‌లింగంపల్లి-విశాఖపట్నం-లింగంపల్లి జన్మభూమి ఎక్స్ ‌ప్రెస్‌, ‌గౌతమి ఎక్స్ ‌ప్రెస్‌ ‌తోపాటు లింగంపల్లి-తిరుపతి-లింగంపల్లి నారాయణాద్రి ఎక్స్ ‌ప్రెస్‌ ‌రైళ్లు లింగంపల్లి నుంచే బయలుదేరుతున్నాయి. మరికొన్ని ప్రత్యేక రైళ్లు కూడా లింగంపల్లి నుంచే బయలుదేరుతున్నాయి. హైటెక్‌ ‌సిటీ రైల్వేస్టేషన్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నారు. దూరప్రాంతాలకు ప్రయాణించే హైదరాబాద్‌, ‌సికింద్రాబాద్‌ ‌ప్రయాణికుల్లో 50 శాతం మంది లింగంపల్లి నుంచే రాకపోకలు సాగిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

కాచిగూడ నుంచి బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ రైళ్లను పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవి మల్కాలిజిగిరి, మౌలాలి స్టేషన్లలో ఆపాలని నిర్ణయించారు. చర్లపల్లి రైల్వేస్టేషన్‌ ‌లో 6 ప్లాట్‌ ‌ఫారాలున్నాయి. యాదగిరిగుట్ట వరకు మూడో లైను సిద్ధమవుతోంది. మౌలాలి నుంచి చర్లపల్లి దాటి ఘట్‌ ‌కేసర్‌ ‌వరకు 4 లైన్లున్నాయి. దూర ప్రాంతాల రైళ్లు ఇక్కడి నుంచి సులభంగా రాకపోకలు సాగించేలా చూస్తున్నారు. రెండోదశలో ఎంఎంటీఎస్‌ ‌రైళ్లు 2024 జనవరి నుంచి ఘట్‌ ‌కేసర్‌ ‌వరకు పరుగులు తీయనున్నాయి. ఎంఎంటీఎస్‌లో చర్లపల్లి చేరుకొని అక్కడి నుంచి ప్రయాణం చేయవచ్చు.లింగంపల్లి నుంచి బయలుదేరే ప్రతి రైలు హైటెక్‌ ‌సిటీలో ఆగి సనత్‌ ‌నగర్‌ – ‌మౌలాలి మధ్య ఎంఎంటీఎస్‌ ‌రెండో దశలో నిర్మించిన అదనపు లైను ద్వారా చర్లపల్లికి చేరుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. కాచిగూడ నుంచి వచ్చే రైళ్లు సీతాఫల్‌ ‌మండి మీదగా మల్కాజిగిరి, మౌలాలి చేరుకుంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *