సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల పట్ల జాలి దయ చూపండి

సింగరేణి బొగ్గు గనులు 59 : 41 వాటాలు కలిగియున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సంస్థ.  చట్టాలు, బొగ్గు గనుల కొత్తవి ఏర్పాటు చేయుటకు, ఉన్నవాటిని విస్తరణ చేసుకొనుటకు,  వేతనాలు, రక్షణ మొదలగు  విషయాలు వీటి నియమ నిబంధనలు కేంద్రం ప్రభుత్వం చూస్తుంది. పరిపాలన యావత్తు  రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో కలిగి ఉన్న సంస్థ .  ఈ సంస్థకు ఎనలేని సేవ చేసి ప్రకృతి విరుద్ధంగా చీకటి గుహలో పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగుల  పట్ల అటు కేంద్ర ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు  వివక్షకు గురి చేస్తున్నవి. 1998 సీఎంపీఎస్‌ ‌చట్టం ప్రకారం ప్రతి మూడేళ్లకు ఒకసారి పెన్షన్‌ ‌పెంచవలసి ఉన్న 25 ఏళ్లు గడిచిన ఒక్కసారి కూడా పెన్షన్‌ ‌పెంచడం లేదు ఫలితంగా చాలీచాలని పెన్షన్‌ ‌తో  చివరి దశ జీవన యానం సాగించుటకు అనేక అనేక కష్టాలు ఎదుర్కొంటున్నాం. అసలు ఈ రెండు ప్రభుత్వాలకు దేశంలో రిటైర్డ్ ‌బొగ్గు గని ఉద్యోగులు జీవించి ఉన్నట్లు కూడా వారికి తెలియడం లేదు.

ముఖ్యంగా వైద్య సౌకర్యాలు కల్పించడంలో సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడం వలన   సమయానికి సరియైన వైద్యం దొరకక అనేక అగచాట్లు పాలవుతున్నాము. రిటైర్డ్ ఉద్యోగులు చాలామంది హైదరాబాద్‌ ‌కరీంనగర్‌ ‌వరంగల్‌ ‌ఖమ్మం తదితర పట్టణాలలో నివాసం ఏర్పరచుకొని ఉన్నారు. సింగరేణి యాజమాన్యం రిటైర్డ్  ఉద్యోగులకు  ఉచితంగా అవుట్‌ ‌పేషెంట్‌ ‌సౌకర్యము సింగరేణి ఏరియా దవఖానాలో కల్పిస్తున్నది. ప్రతి నెల ఆయా ధవఖానాలకు పోవడం చాలా కష్టతరంగా ఉంటున్నది మరియు ఆరోగ్యం కూడా సహకరించడం లేదు.  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల ఉచిత వైద్య సౌకర్యాలు కల్పించాలని ముఖ్యమంత్రికి, సింగరేణి చైర్మన్‌ ‌కు, రాష్ట్ర ముఖ్యమైన మంత్రి  కేటీఆర్‌ ‌కు, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావుకు, ఇతర మంత్రులకు సింగరేణి ప్రాంత ప్రజా ప్రతినిధులకు గుర్తింపు సంఘం నాయకులకు మరియు జాతీయ  కార్మిక సంఘాల నాయకులకు వివిధ వేదికల ద్వారా మరియు వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేసిన చెవిటి వాని ముందు శంఖం ఊదినట్టు ఉన్నది.

రాష్ట్రంలో ఎన్నో ఎన్నెన్నో గడ్డు సమస్యలు కూడా పరిష్కరించబడుతున్నాయి. కానీ సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల వైద్య సమస్యలు పరిష్కరించుటకు ఎలాంటి చొరవ చూపడం లేదు మరియు ముందరికి కూడా రావడం లేదు. ప్రస్తుతం సింగరేణి లాభాలు  గడిస్తున్నదంటే అది మా శ్రమ ఫలితమే అని మేము సగర్వంగా తెలియజేస్తున్నాము. మేము కోరేది సింగరేణి లాభాల వాటా కాదు మా శేష జీవితం సుఖంగా ఆరోగ్యవంతంగా గడుపుటకు అన్ని రకాల ఉచిత కార్పొరేట్‌ ‌వైద్య సౌకర్యాలు కల్పించాలని మాత్రమే ముకుళిత హస్తాలతో వేడుకొనుచున్నాము.  వెంటనే తగు చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాము.  మా ఈ దీనావస్థను చూసి రాష్ట్ర ప్రభుత్వము సింగరేణి యాజమాన్యం దయ జాలి చూపుతుందని ఎదురు చూస్తూ ఉంటాం.

– దండంరాజు రాంచందర్‌ ‌రావు,
రిటైర్డ్ ‌డిప్యూటీ సూపరింటెండెంట్‌ ‌సింగరేణిభవన్‌ ‌హైదరాబాద్‌
‌మరియు అధ్యక్షుడు సింగరేణి రిటైర్డ్ ఎం‌ప్లాయిస్‌ ‌వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ‌కాప్ర హైదరాబాద్‌
9849592958.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *