– హాస్పిటల్ ఎదుట బాధిత కుటుంబం ఆందోళన
వరంగల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: రాయపర్తి మండలంలో సామూహిక హత్యాచారం తీవ్ర కలకలం రేపింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిపై నలుగురు యువకులు హత్యాచారానికి పాల్పడ్డారు. తమ కుమార్తె(21)పై బుధవారం రాత్రి రావూరు తండాకి చెందిన నలుగురు అత్యాచారం చేశారని యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అత్యంత పాశవికంగా ఆమెను చిత్రహింసలకు గురి చేసి అనంతరం ఉరి వేసి చంపేశారని బాధిత కుటుంబం తమ ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలు తీవ్ర రక్త స్రావంతో మృతిచెందిందని చెబుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వర్ధన్నపేటలో మార్చురీ ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



