సాధించాలనే కాంక్షతోటే లక్ష్యానికి చేరువ!

మానసిక దృఢత్వంతో సాధించాలనే కసిని పెంచుకోవాలి

పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయనో, అనుత్తీర్ణులయ్యామనో బాధ పడొద్దు. మార్కులు ర్యాంకులే ప్రధానం కాదు. ఓటమిని నేర్చితేనే విజయం సులువవుతుంది.  ప్రపంచంలో లక్ష్యాలేన్నో ఉన్నాయి అందులో  మనమూ ఒకటి సాధిద్దాం. ఒక సమిధలా వెలుగుదాం. ప్రపంచానికి ఒక వెలుగును ప్రసాదిద్దాం. గెలుపునకు తుదిమెట్టు అంటూ ఏది ఉండదు, ఓటమి అన్నది ఎప్పుడు అపాయకారి కాదు. మనకు ఈ రెంటిని సాధించాల్సిన దానికి కావాల్సింది మనో దైర్ఘ్యం, ఆత్మ విశ్వాసం, పట్టుదల.

విద్యార్థులు నిరాశకు లోనుకాకండి, మానసిక దృఢత్వంతో సాధించాలనే కసిని పెంచుకోవాలి, పరీక్షలలోని మార్కులే జీవితానికి ప్రామాణికం కాదని, మానసిక ధైర్ఘ్యాన్ని కోల్పోడుకుండా సమస్యకు ఎదురొడ్డినిలిచినపుడే జీవితం పరమార్థకం అవుతుందని, ఉన్నత శిఖరాలకు చేరుకోగలుగుతారు.  జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేలా కృషి తల్లిదండ్రులు స్నేహితుల బాధ్యత: పిల్లలలో తక్కువ మార్కులు వచ్చాయని తల్లిదండ్రులు %టతీబర్‌తీa్‌ఱశీఅ% కు లోనవుతారు. తోటి విద్యార్థులతో పోల్చకుండా జాగ్రత్త పడాలి. పిల్లలకు జీవిత విలువను గుర్తించేలా ప్రోత్సహించాలి. కళ్ల ముందు ఎన్నో లక్ష్యాలెన్నో ఉన్నాయి. ఒకసారి ఓడినంత మాత్రానా కుంగిపోవాల్సిన పనిలేదు. నిరంతరం సమస్యలతో పోరాటం చేస్తూనే జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేలా కృషి చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రుల స్నేహితులపై ఉంది.

సాధించాలనే కాంక్షతో లక్ష్యానికి చేరువ:  ‘‘ జీవన పోరాటంలో విజయాలు, వైఫల్యాలు సహజము’’, నేటి పోటి ప్రపంచంలో తాము అనుకున్నది సాధించాలనే కాంక్ష మరియు ప్రస్తుతమున్న స్తితి నుంచి మరింత ఉన్నత స్తితికి ఎదగాలనుకునే క్రమంలో ఎదురయ్యే సమస్యలు, అడ్డంకులు, వైఫల్యాల మూలంగానే భావోద్వేగాలకులోనై వాటిని పరిష్కరించుకునే క్రమంలో తీవ్ర ఒత్తిడికి, ఆందోళనలకు లోనవుతూ నిరాశ నిస్పృహలకు లోనయ్యే వారెందరో ఉన్నారు. ఫలితంగా వారి జీవన విధానంలో అపసవ్యత నెలకొంటుంది. ఆశించిన జీవితానికి, అనుభవిస్తున్న జీవితానికి మద్య వ్యత్యాసం ఎక్కువైనపుడు కలిగే ఆందోళన , ఒత్తిడి మూలంగా మానసిక, శారీరక అనారోగ్యాలకు లోనవుతున్న వారు సమాజంలో ఎందరో ఉన్నారు.. తల్లిదండ్రులు, స్నేహితులు , బంధువులు విద్యార్థులలో తక్కువ మార్కులు వచ్చాయనే ఆందోళనను దూరం చేయాలి.సాధించాలనే కాంక్షతో లక్ష్యానికి చేరువవుతారు. నిరంతర ప్రోత్సాహంతో కలిగే భరోసాతో సాధించవచ్చు:  విద్యార్థులలో పరీక్షలలో తక్కువ మార్కులు వచ్చినా జీవితంలో సాధించడానికి, ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని మానసికంగా నిరంతరం మెదడుకు కావల్సిన శక్తిని అందించుకోవాలి. తల్లిదండ్రులు, మిత్రులు మేమున్నామనే నిరంతర ప్రోత్సాహంతో భరోసాను కల్పించాలి. ఈ భరోసాతో జీవితంలో ఏదైనా సాధించవచ్చు.

మీ శ్రమే ఆయుధం: మానసిక ఆందోళనలను తగ్గించుకోవాలి. మిమ్మల్ని, మీ శ్రమని నమ్మండి. సానుకూల ఫలితం వస్తుందనే భావంతో ఆత్మవిశ్వాసం పెంచుకోండి. మంచి మార్గ దర్శకత్వం ఇచ్చే వ్యక్తిని మెంటారుగా స్వీకరించడం , అంచెలంచెలుగా ఎదగాడానికి కృషి చేయాలి. లక్ష్య సాధనలో ఎన్నో రకాల అడ్డంకులు వస్తూఉంటాయి వాటికి ఎదురీదుతూ వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెల్లినవారే ప్రపంచ విజేతలు అవుతారు. ఒక అంశం నేర్చుకోవాలనుకున్నప్పుడు అది ఎంత కఠినమైనా కానీ ఆ అంశం సాధనలో మిత్రులతో చర్చించడం, మేధావులు, విజేతల సహాకారం తీసుకోవడం, సీనియర్స్‌ సలహాలను తీసుకొని ముందుకు వెల్తే  మీ లక్ష్యం మీకు దాసోహం అవుతుంది. నీ వెనుక ఏముంది… ముందేముంది..అనేది నీ కనవసరం. నీలో ఏముంది అనేది ముఖ్యం. నీ శక్తి సామర్ధ్యాలతో లక్ష్యాన్ని సాధించాలి. ఇలా ఎందరో సాధించారు మనమూ సాధిద్దాం ఇతరులకూ స్ఫూర్తినిద్దాం.
-డా.అట్ల శ్రీనివాస్‌ రెడ్డి
స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ రిహాబిలిటేషన్‌,  
సైకాలజిస్ట్‌ ఫ్యామిలీ కౌన్సెలర్‌ , సెల్‌: 9703935321

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *