హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి 25: సర్పంచులు ఏం చేయాలో ఎమ్మెల్యేలే డిసైడ్ చేస్తున్నారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. వారి హక్కులను కాలరాస్తూ నిధులను కాజేస్తు న్నారని అన్నారు. సర్పం చ్లకు హక్కులు లేకుండా ప్రభు త్వమే పెత్తనం చేస్తోందన్నారు. హైద రాబాద్ లక్డికపూల్లో సర్పంచుల ఫోరం, పంచాయతీ రాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో పంచాయతీ రాజ్ చట్టంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కోదండరాం.. ప్రజల మద్ధతుతో ఎన్నికల్లో గెలిచిన సర్పంచులపై ప్రభుత్వం పెత్తనం చెలాయించడం దుర్మార్గమని అన్నారు.
కాంట్రాక్టుల ద్వారా వచ్చే కషన్ల కోసమే సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారని ఆరోపించారు. అధికారం లేకపోతే వారు ఉండలేరని.. దానికోసం ఎన్ని అక్రమాలైనా చేస్తారని మండిపడ్డారు. సర్పంచులు బలమైన శక్తులతో పోరాడుతున్నారని.. దానికి తగ్గట్లుగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని కోదండరాం సూచించారు. అన్ని పార్టీలతో చర్చించి నెల రోజుల్లో బలమైన కార్యాచరణ సిద్ధం చేసుకుందామని భరోసానిచ్చారు. సర్పంచుల నిధులు కొట్టేసిన దొంగ కేసీఆర్ అని బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. కేంద్ర నిధులను రాష్ట్ర సర్కార్ దారి మళ్లిస్తోందని ఆరోపించారు. పంచాయతీ రాజ్ చట్టంపై హైదరాబాద్ లక్డికాపూల్?లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కేసీఆర్ ఇచ్చిన హాల్లో ఒక్కటి కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. గతంలో సర్పంచ్ లకు ఎంతో మర్యాద ఉండేదని.. ఇప్పుడు కనీస విలువ లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ తెచ్చిన రాజ్యాంగ సవరణలు అమలుకావట్లేదని కొండా వాపోయారు.
కేసీఆర్ పాలనలో సర్పంచులు సెక్యూరిటీ గార్డు, వాచ్ మెన్లుగా పనిచేస్తున్నారని అన్నారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి ఎవరో తనకు తెలియదని.. కేసీఆర్, కేటీఆర్ లే అన్ని శాఖలు చూస్తున్నారని విమర్శించారు. సర్పంచుల సమస్యలు కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని హా ఇచ్చారు. సర్పంచులు రాజీనామా చేస్తే ప్రభుత్వమే దిగొస్తుందని బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. సర్పంచులు చిన్న తప్పులు చేస్తే కాళేశ్వరం స్కాంలాగా అధికారులు భావిస్తున్నారన్నారు. కొత్త మున్సిపల్, పంచాయతీ రాజ్ చలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రగతిభవన్ పెద్ద గడి అయితే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ చిన్న గడి అని ఆరోపించారు. కేంద్ర నిధులు సర్పంచులకు అందకుండా కేసీఆర్ సర్కార్ దారిమళ్లించడం దుర్మార్గమన్నారు. స్థానిక సంస్థలను కేసీఆర్ నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. సర్పంచులను కేంద్రం దగ్గరికి తీసుకెళ్తామని హా ఇచ్చారు.





