మహేశ్వరం, ప్రజాతంత్ర డిసెంబర్ 28: కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవం పురస్కరించుకొని.. గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభయ హస్తం కింద చేపట్టిన ఆరు గ్యారెంటీల ధరఖస్తుల స్వీకరణ కార్యక్రమం సరూర్ నగర్ వార్డు కార్యాలయం లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆకుల అరవింద్ కుమార్, తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పారిజాత నర్సింహ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రజాపాలన సరూర్ నగర్ వార్డ్ కార్యాలయం, చెరుకుతోట కాలనీ లలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ అభయాసం కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన వారు గ్యారెంటీ పథకాలకు ప్రతి ఒక్కరు దరఖా చేసుకోవాలని సూచించారు. వంద రోజుల్లో ఆర్గారింట్లో అమలు చేయడం జరుగుతుందని అన్నారు. రాబోయె 2024 పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం కాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరమల్ల సుధాకర్ గౌడ్, పులి గౌడ్, మహేందర్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.
సరూర్ నగర్ లో ఆరు గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం





