సరిహద్దు చెక్ పోస్ట్ ల దగ్గర అప్రమత్తంగా ఉండాలి

ప్రజాతంత్ర కొడంగల్ అక్టోబర్ 7:  తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు  జరగనున్న సందర్భంగా దౌల్తాబాద్  మండల సరిహద్దులో  చంద్రకల్  గ్రామంలోని జాతీయ రహదారిపై నూతనంగా  ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను  కొడంగల్ సీఐ బి రాములు దౌల్తాబాద్ మండల ఎస్సై రమేష్ కుమార్ తో కలిసి ప్రారంభించారు  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెక్ పోస్ట్ ల దగ్గర విధులు నిర్వర్తిస్తున్నటువంటి పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని తెలిపారు  తెలంగాణ  రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇక్కడి ఓటర్లను ప్రలోభ పెట్టడానికి వారిని ప్రభావం చేయడానికి డబ్బు, మద్యము, విలువైన వస్తువులు రాష్ట్ర సరిహద్దు నుండి అక్రమంగా తరలించడానికి అవకాశం ఉన్నందున చెక్ పోస్ట్ లో  విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు అప్రమత్తంగా ఉండి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి రిజిస్టర్లో వాహనాల వివరాలను నమోదు చేయాలని తెలిపారు.  సరిహద్దుల్లో ఉన్న గ్రామాలపై కూడా పూర్తి నిఘా ఉంచాలని   నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులపై వారి కదలికలపై నిఘా ఉంచాలని  అన్నారు  ఈ కార్యక్రమంలో పోలీసు కారులు   సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *